సాక్షి, తాడేపల్లి: అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనిలో భాగంగా 10లక్షల 45వేల కుటుంబాలకు రూ.905.57 కోట్లు చెల్లించినట్లు సీఎం జగన్ తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారుల బ్యాంకు ఖాతాల్లో రెండో విడత పరిహారాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రెండో దశ కింద రూ.20వేల లోపు 7 లక్షల మంది డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్ల నగదు జమ చేశామని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని, పేద ప్రజల కోసం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసమే అగ్రిగోల్డ్ స్కామ్ జరిగిందని, గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కైందని సీఎం జగన్ అన్నారు.
ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవని, 2019 నవంబర్‌లోనే 3.40 లక్షల మందికి రూ.238.73 కోట్లు చెల్లించామని సీఎం జగన్ తెలిపారు. రూ.20వేల లోపు డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్లు, 10లక్షల 45వేల కుటుంబాలకు రూ.905.57 కోట్లు జమ చేశామని సీఎం తెలిపారు. అగ్రిగోల్డ్ వ్యవహారం కొలిక్కి రాగానే మిగిలిన డిపాజిటర్లకు చెల్లింపులు ఉంటాయని సీఎం పేర్కొన్నారు.
గత ప్రభుత్వం కష్టజీవుల సొమ్మును కాజేసింది
అగ్రిగోల్డ్ సంస్థను నమ్మి చిన్న వ్యాపారులు నష్టపోయారని, ఆ సంస్థలో ఉన్న డబ్బంతా కష్టజీవులదేనని సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వం కష్టజీవుల సొమ్మును కాజేసిందని తెలిపారు. అగ్రిగోల్డ్ స్కామ్‌కు కర్త, కర్మ, క్రియ గత ప్రభుత్వమేనని సీఎం తెలిపారు. గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసమే అగ్రిగోల్డ్ స్కామ్‌మని, బాధితులకు ఒక్క రూపాయి చెల్లించలేదని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు మోసం చేస్తూ వచ్చిందని సీఎం జగన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని, గతంలో 300 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ అండగా నిలిచారని తెలిపారు. రూ.20వేల లోపు డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్ల నగదు జమ చేస్తున్నారని, ఇప్పటికే రూ.10వేలలోపు డిపాజిటర్లకు రూ.238.73 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో బాధితులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదన్నారు.
అగ్రిగోల్డ్ బాధితులకు మొదటి దశలో రూ.10 వేల లోపు డిపాజిట్‌దారులైన 3.40 లక్షల మందికి 2019లోనే రూ.238.73 కోట్లను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. దీంతో మొదటి, రెండో దశలో కలిపి మొత్తం 10.40 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం రూ.905.57 కోట్లు పంపిణీ చేసినట్లు అయింది.
Comments
Please login to add a commentAdd a comment