‘ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్‌ ఆదుకున్నారు’ | Agri Gold Victims Support Meeting Will Conducting At Tadepalli YSRCP Office | Sakshi
Sakshi News home page

‘ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్‌ ఆదుకున్నారు’

Published Mon, Oct 28 2019 8:03 PM | Last Updated on Mon, Oct 28 2019 8:40 PM

Agri Gold Victims Support Meeting Will Conducting At Tadepalli YSRCP Office - Sakshi

సాక్షి, విజయవాడ : తమది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి నిరూపించారని అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ కో ఆర్డినేటర్‌ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం (అక్టోబర్‌ 29) నాడు అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు రూ.1150 కోట్ల మంజూరు చేశారని వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పటికీ సీఎం జగన్‌ బాధితుల పక్షాన నిలిచారని కొనియాడారు. రేపు నిర్వహించబోయే సమావేశానికి వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు, పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్‌ ముఖ్య ప్రతినిధులు హాజరుకానున్నట్లు అప్పిరెడ్డి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement