
కొత్త దంపతులతో రామ్‌చరణ్, ఉపాసన
దోమకొండ: కామారెడ్డి జిల్లా దోమకొండగడీ కోట వారసులైన కామినేని అనిల్‌కుమార్, శోభనల కుమార్తె అనుష్పాల వివాహం సందర్భంగా ఆదివారం కోటలో పోచమ్మ పండుగ నిర్వహించారు. పెళ్లికూతురు అనుష్పాల పోచమ్మకు బోనం సమర్పించారు. ఈ పండుగ కోసం రిటైర్డు ఐఏఎస్ అధికారి, దివంగత కామినేని ఉమాపతిరావ్ భార్య పార్వతమ్మ హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుంచి వచ్చారు.
వేడుకలకు సినీ నటుడు రామ్‌చరణ్ తేజ, ఆయన సతీమణి ఉపాసనతో పాటు అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎంపీలు టి.సుబ్బరామిరెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. అపోలో ఆస్పత్రులకు చెందిన వందలాది మంది ఉద్యోగులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.