pochamma festival
-
దోమకొండ ఫోర్టులోపోచమ్మ పండుగ
దోమకొండ: కామారెడ్డి జిల్లా దోమకొండగడీ కోట వారసులైన కామినేని అనిల్‌కుమార్, శోభనల కుమార్తె అనుష్పాల వివాహం సందర్భంగా ఆదివారం కోటలో పోచమ్మ పండుగ నిర్వహించారు. పెళ్లికూతురు అనుష్పాల పోచమ్మకు బోనం సమర్పించారు. ఈ పండుగ కోసం రిటైర్డు ఐఏఎస్ అధికారి, దివంగత కామినేని ఉమాపతిరావ్ భార్య పార్వతమ్మ హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి వచ్చారు. వేడుకలకు సినీ నటుడు రామ్‌చరణ్ తేజ, ఆయన సతీమణి ఉపాసనతో పాటు అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎంపీలు టి.సుబ్బరామిరెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. అపోలో ఆస్పత్రులకు చెందిన వందలాది మంది ఉద్యోగులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. -
వరాలిచ్చే తల్లి నల్లపోచమ్మ
♦ ముంబై, థానేల్లో ఘనంగా జరుగుతున్న పోచమ్మ తల్లి ఉత్సవాలు ♦ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం సమర్పణ ♦ థానేలో 150 ఏళ్ల చ రిత్ర కలిగిన జానకీదేవి ఆలయం సాక్షి, ముంబై : తెలుగు వారు ఎక్కువగా ఉన్న ముంబైతోపాటు థానే జిల్లాలో పోచమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగానే ఇక్కడ కూడా ప్రతిఏటా ఆషాఢ మాసంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఇక్కడి ప్రజలు వీలును బట్టి పండుగ జరుపుకుంటారు. ఆది, బుధవారాల్లో ఎక్కువగా పోచమ్మ పండుగ నిర్వహిస్తారు. తెలుగు సంఘాలు, మండళ్ల ఆధ్వర్యంలో సామూహిక పోచమ్మ పండుగ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది ఆగస్టు 14 వరకు ఆషాఢమాసం ఉన్నప్పటికీ ఆగస్టు 2, 9 తేదీల్లో పండుగ చేసుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రసిద్ధి చెందిన జానకీ దేవి ఆలయం థానే నగరంలోని శాస్త్రినగర్‌లో ఉన్న జానకీదేవి ఆలయం స్థానికంగా ప్రసిద్ధి చెందింది. జానకీదేవిని మరాఠీయులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. స్థానిక తెలుగువారు మాత్రం పోచమ్మగా పూజిస్తారు. ఆషాఢ మాసంలో సంప్రదాయ పద్ధతిలో పండుగ జరుపుకుంటారు. శాస్త్రినగర్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగు ప్రజలు కూడా వచ్చి వేడుకల్లో పాల్గొంటారు. గుడి వద్ద దసరా, నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. సుమారు 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో రామదాస్ బాబా అనే తెలుగు వ్యక్తి అర్చకులుగా ఉండేవారు. ఆలయ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు స్థానికులు చెబుతారు. బాబా తన జీవితాన్ని ఈ ఆలయానికే అంకితం చేశారని కీర్తిస్తారు. ఆయన హయాంలోనే గుడి తెలుగు వారి పోచమ్మ ఆలయంగా మారినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. ఆయన 50 ఏళ్లకు పైగా ఈ ఆలయంలో పూజలు నిర్వహించారు. 1995 జనవరి 11న బాబా మరణం అనంతరం సావంత్ బాబా అనే మరాఠీ వ్యక్తి ఆలయంలో పూజారీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జానకీదేవి ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో పోచమ్మ ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే ఎన్నో ఏళ్లు నిస్వార్థ సేవలందించిన రామదాస్ బాబా సమాధి మందిరాన్ని కూడా ఇక్కడ నిర్మించడం విశేషం. వరాలిచ్చే.. వరాలదేవి భివండీలో ప్రాచీనమైన వరాలదేవి మాత మందిరం ప్రసిద్ధి చెందింది. ఈ మందిరంలో కొలువైన వరాలదేవినే తెలుగు ప్రజలు పోచమ్మ తల్లిగా కొలుస్తున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి వలస వచ్చిన తెలుగు ప్రజలందరు ఆషాఢ మాసంలో పోచమ్మ పండుగను జరుపుకోవడం ప్రారంభించారు. భివండీలోకెల్లా వరాల దేవి ఆలయం చారిత్రాత్మకమైనది, అతి ప్రాచీనమైనది. ఆలయం సమీపంలో ఉన్న జలాశయాన్ని కూడా వరాలదేవి జలాశయంగా పిలుస్తారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా పోచమ్మ బోనాలు తీసుకెల్లడంతోపాటు కోళ్లు, మేకలను దేవికి బలిస్తున్నారు. ఈ సారి కూడా భివండీలోని తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున పోచమ్మ పండుగను జరుపుకుంటున్నారు. భివండీలో ఆది, శుక్రవారాలు సెలవు కావడంతో ఇక్కడి ప్రజలు అప్పుడే చేసుకుంటారు. -
ముంబైలో బోనాలు
సాక్షి, ముంబై: నగరంలో తెలుగు ప్రజలు ఆదివారం పోచమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. శ్రావణ మాసం ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈ శ్రావణ మాసాన్ని కచ్చితంగా పాటించేవారు గణేశ్ ఉత్సవాలు పూర్తయ్యేంతవరకు మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. దీంతో మాంసాహారం తినేవారు ఈ శనివారం లోపు పోచమ్మ పండుగ చేసుకోవాల్సి వచ్చింది. ఆ ప్రకారం ఇదే ఆఖరు ఆదివారం కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున పోచమ్మ పండుగను జర్పుకున్నారు. పోచమ్మ గుడులన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులతో కిటకిటలాడాయి. కామాటిపుర, వర్లీలోని భోగాదేవి తదితర పోచమ్మ ఆలయాలన్నీ సందడిగా కనిపించాయి. ఎంతో ఓపిగ్గా మహిళలు, పిల్లలు క్యూలో నిలబడి పోచమ్మకు కోళ్లు, మేకలు, నైవేద్యాలు సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భాజాబజంత్రీలతో తలపై బోనాలు పెట్టుకుని గుడికి చేరుకున్నారు. పూజలుచేసి నైవేద్యాలు సమర్పించారు. మరికొందరు స్థానికంగా ఉంటున్న వారందరు కలిసికట్టుగా ఒకేచోటా ఈ పండుగను జరుపుకున్నారు. ఠాణేలో... ఠాణేలోని తెలుగు సేవా మండలి సభ్యులు ఆదివారం పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయమే పిల్లలు, మహిళలు,ృవద్ధులు శాస్త్రినగర్‌లో ఉన్న జానకీమాత దేవి మందిరానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడి తెలుగు ప్రజలు జానకీమాత దేవినే పోచమ్మ తల్లిగా భావిస్తారు. వెంట తెచ్చుకున్న మేకలు, కోళ్లు బలిచ్చారు. నైవేద్యాలు సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకున్నట్లు ఆ సంస్థ సభ్యులు మెంగు రమేశ్, మెంగు లింగన్న, గుండారపు పుల్లయ్య, గంగాధరి శంకర్ తదితరులు చెప్పారు. ఘాట్కోపర్లో... కామ్‌రాజ్‌నగర్‌లోని తెలుగు రహివాసి సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక పోచమ్మ గుడిలో ఆదివారం ఉదయం పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఇక్కడుంటున్న దాదాపు 500లకుపైగా తెలుగు కుటుంబాలు కలిసి ఈ పండగను జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా మేకలు బలిచ్చి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. పండుగను పురస్కరించుకుని ఆలయాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాటుచేసినట్లు ఆ సంస్థ అధ్యక్షుడు గుల్లే గంగాధర్, శంకర్ నాయక్, బాస శంకర్, జక్కుల తిరుపతి, కట్ట అశోక్, గుర్రం శ్రీనివాస్, తిక్కు నాయక్, సత్యనారాయణ తదితరులు చెప్పారు. బోరివలిలో.. బోరివలి, న్యూస్‌లైన్: మలాడ్‌లోని తెలంగాణ ప్రజలు ఆదివారం అశోక్‌నగర్‌లోని బాన్ డోంగిరిలో తెలుగు సమాజ్ సొసైటీ ఆధ్వర్యంలో పోచమ్మ, ముత్యాలమ్మ, మైసమ్మ, నల్లపోచమ్మ అమ్మవార్లకు బోనాలు ఘనంగా నిర్వహించారు. ఇక్కడ 650 గజాల స్థలంలో నలుగురు అమ్మవార్ల మందిరాలు ఉన్నాయి. స్థానిక ఆగన్న కుటుంబం నుంచే మొదట పెద్ద బోనం వెళుతుంది. తర్వాత మిగతా బోనాలను అమ్మవారికి సమర్పిస్తారు. కాగా, ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా ఉంటారు. అమ్మవారికి ప్రతి ఏటా మొక్కులు చెల్లించుకుంటామని వారు తెలిపారు. కార్యక్రమంలో పి.ప్రభాకర్ రావు, జి.రాజ్ కుమార్, డి.కిషన్ రావు, డి.పాపారావు, వి. చిన్నికిష్టయ్య, ఎల్.కిషన్ రావు, పి.శ్రీనివాసరావు, జె.తిరుపతిరావు, బి.రాజన్న, ఎం.రవీందర్రావు, జి.రామారావు తదితరులు పాల్గొన్నారు.