ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో రామ్‌చరణ్ గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగాడు. ప్రపంచమంతటా అభిమానులను సంపాదించుకున్నాడు. నాటునాటుకు ఆస్కార్ రావడంతో సినిమా యూనిట్‌కు మరింత గుర్తింపు లభించింది. అయితే ఈ పేరు, ప్రతిష్టలు రావడానికి కారణం ఉపాసన కడుపులో పెరుగుతున్న బిడ్డేనని మురిసిపోయాడు. ఆ బిడ్డను చేతుల్లో ఎత్తుకుని ముద్దాడే సమయం కోసం వేయి కళ్లతో ఎదురుచూశాడు. ఒక్క చరణ్ మాత్రమేనా? మెగా ఫ్యామిలీ అంతా పుట్టబోయే బిడ్డకోసం కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూశారు.
సెంటిమెంట్ రోజే పాప జననం
చివరకు వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతూ మెగా కుటుంబం సెంటిమెంట్ రోజైన మంగళవారం నాడే (జూన్ 20న) ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. స్వయంగా మహాలక్ష్మి దేవియే మా కుటుంబంలోకి వచ్చిందని కుటుంబమంతా సంబరాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో అసలు ఉపాసన ఏం చదివింది? తనకు ఎంత ఆస్తి ఉంది? అన్న వివరాలు ఆరా తీస్తున్నారు. కావున.. ఉపాసన ఆస్తి వివరాలు ఓసారి చూసేద్దాం..
100 బిలియనీర్స్‌లో ఉపాసన తాతయ్య
రామ్‌చరణ్-ఉపాసనల ఆస్తి విలువ రూ.2500 కోట్లు. ఇందులో ఒక్క ఉపాసన ఆస్తే రూ.1130 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఉపాసన బడా వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన మహిళ. ఉపాసన బిజినెస్ టైకూన్ సి.ప్రతాప్ రెడ్డి మనవరాలు. ఆయన అపోలో హాస్పిటల్స్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన నికర ఆస్తుల విలువ రూ.21,000 కోట్లు. భారత్‌లోని టాప్ 100 బిలియనీర్స్‌లో ఆయన ఒకరు. ప్రస్తుత అపోలో హాస్పిటల్స్ మార్కెట్ విలువ రూ.70,000 కోట్లుగా ఉంది. అపోలో హాస్పిటల్స్‌కు ఉపాసన వైస్ ప్రెసిడెంట్‌గా, ఆమె తల్లి శోభన ఎగ్జిక్యూటివ్ వైఎస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోంది.
తాతయ్య ప్రతాప్ రెడ్డి దంపతులతో ఉపాసన జంట
పట్టా చేతికి రాగానే..
ఉపాసన చదువు విషయానికి వస్తే.. ఆమె ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. పట్టా చేతికి రాగానే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. అపోలో ఆస్పత్రిలో వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే బి పాజిటివ్ అనే మ్యాగజైన్‌కు ఎడిటర్ ఇన్ చీఫ్‌గా వ్యవహరిస్తోంది. కుటుంబ ఆరోగ్య బీమాకు సంబంధించిన టీపీఏ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గానూ ఉంది. ఉపాసన తండ్రి కెఈఐ అనే కంపెనీని స్థాపించాడు.
వ్యాపారంలోనే కాదు సేవలోనూ ముందంజలో
ఇకపోతే ఉపాసనకు ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఆశగా ఉండేది. ఏమైందో ఏమో కానీ తన నిర్ణయం మార్చుకుని ఫ్యామిలీ బిజినెస్ చూసేందుకే మొగ్గు చూపింది. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో జనరల్ మేనేజర్‌గా చేరి ఇప్పుడు ఉన్నత స్థాయికి చేరింది. వ్యాపారాన్ని సమర్థవంతంగా చూసుకునే ఆమె స్వచ్ఛంద కార్యక్రమాల్లోనూ ముందు వరుసలో ఉంటుంది.
చదవండి: వేరొక మహిళతో ఎఫైర్? డబ్బులిచ్చి మరీ కమెడియన్ కాళ్లు విరగ్గొట్టించిన భార్య!
రామ్‌చరణ్.. బాల్యంలో నా చేతులతో నిన్ను హత్తుకున్న రోజులు నాకింకా గుర్తున్నాయి: మంత్రి రోజా
Comments
Please login to add a commentAdd a comment