సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో మే 3 నుంచి ప్రారంభం కానున్న వివిధ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. తొలుత ఏప్రిల్ 25 నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను 30న జరిగే సాధరణ ఎన్నికల దృష్ట్యా మే 3కు వాయిదా వేశారు. ఓట్ల లెక్కింపు కారణంగా ఇప్పుడు మరోమారు పరీక్షలను వాయిదా వేశారు. ఓయూ క్యాంపస్‌తో పాటు అనుబంధ కళాశాలల్లో నిర్వహిస్తున్న పీజీ కోర్సులు, బీఈ, బీటెక్, ఎంబీఏ సెమిస్టర్ పరీక్షలను మే 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొ.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. పరీక్షల టైం టేబుల్, ఇతర వివరాలను www.osmania.ac.in లో చూడవచ్చు.