సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల అవినీతిపై సమగ్ర విచారణ జరిపి స్తామని కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి స్పష్టం చేశారు. మామా అల్లుళ్లు విదేశాలకు తరలించిన సొమ్మును వెనక్కి తీసుకొస్తామని.. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2001లో రబ్బర్ చెప్పులతో తిరిగిన హరీశ్‌రావు, ఇప్పుడు వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు.
సోని యాగాంధీ భిక్షతో పదవులు అనుభవిస్తున్న కేసీ ఆర్, హరీశ్‌రావులు అధికార మదంతో ఆమెనే విమర్శిస్తున్నారన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకపోతే రాళ్లతో కొట్టాలని చెప్పిన కేసీఆర్‌ను ప్రజలు అదే పనిచేసి బుద్ధి చెప్పాల న్నారు. ఓట్లు అడిగేందుకు వచ్చే టీఆర్‌ఎస్ నేత లను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment