
సిరుల పంట ‘కినోవా’!
సాగు నీటి కొరత తదితర కారణాల వల్ల వరి సాగు లాభదాయకంగా లేకపోవటంతో నల్లగొండ జిల్లా (పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట)కు చెందిన అభ్యుదయ రైతు వంగాల ప్రతాప రెడ్డి(9885949265) కినోవా అనే కొత్త పంటను సాగు చేస్తున్నారు. బొలీవియా దేశం నుంచి తెప్పించిన తెల్ల రకం కినోవాను ఖరీఫ్‌లో ఎకరంన్నరలో సాగు చేసి 11 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. రూ. 95 వేల నికరాదాయం పొందారు.
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయటంతో రూ. 15 వేలు మాత్రమే ఖర్చయిందన్నారు. తాను పండించిన కినోవా ధాన్యం కిలో రూ. 100లకు విక్రయించారు. వరి సాగు చేసినా ఎకరాకు రూ. 10 వేలు కూడా మిగలటంలేదని, దీనికి బదులు కినోవాను ఆరుతడి పంటగా సాగు చేస్తే ఎకరాకు మంచి ఆదాయం పొందవ చ్చని ఆయన అంటున్నారు. రెట్టించిన ఉత్సాహంతో ఆయన రబీలో రెండెకరాల్లో కినోవాను సాగు చేస్తున్నారు. ట్రేలలో నారు పెంచి, నాట్లు వేశారు.