డిచ్‌పల్లి, న్యూస్‌లైన్: డిచ్‌పల్లి మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి గ్రామ సర్పంచ్ రూప్‌సింగ్ రాథోడ్, వార్డు సభ్యుడు రాజుపై ఉపసర్పంచ్ ప్రతాప్‌రెడ్డి దాడి చేయించాడని నిరసిస్తూ శనివారం డిచ్‌పల్లి తండావాసులు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించా రు. ట్రాక్టర్, ఆటోల్లో తరలి వచ్చిన తండా వాసులు, సర్పం చ్‌తో సహా డిచ్‌పల్లి-నిజామాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు.
ప్రతాప్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీధర్‌గౌడ్ ఘటనా స్థలానికి చే రుకుని తండావాసులు, సర్పంచ్‌ను సముదాయించి రాస్తారోకో విరమింపచేశారు. అనంతరం తండావాసులందరూ పోలీస్‌స్టేషన్‌ను తరలివెళ్లారు. ప్రతాప్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చే శారు. పోలీస్‌స్టేషన్ వద్ద సర్పంచ్ రూప్‌సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. గిరిజనుడనే చిన్న చూపుతోనే తనపై గ్రామానికి చెందిన శ్రీధర్‌రెడ్డితో ఉపసర్పంచ్ దాడి చేయించినట్లు ఆరోపించా రు. తండాలో సీసీ రోడ్డు కాంట్రాక్టు పనులు అప్పగించలేదనే కక్షను మనుసులో ఉంచుకుని ఉపసర్పంచ్ ఇదం తా చేశాడని ఆరోపించాడు.
తండాలో సీసీ రోడ్డు పనుల కో సం వార్డు సభ్యుడు రాజు శుక్రవారం రాత్రి కంకర వేసి ట్రాక్టర్‌పై వస్తుండగా శ్రీధర్‌రెడ్డి అడ్డగించాడన్నారు. తాను అక్కడికి వెళ్లి ట్రాక్టర్‌ను వదిలేయాలని కోరగా కులంపేరుతో దూషిం చాడని, అక్కడికి వచ్చిన ఉపసర్పంచ్ ప్రోత్సాహంతో తనపై దాడి చేసినట్లు సర్పంచ్ తెలిపారు. శ్రీధర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు బంధువులు సైతం తనపై దాడికి పాల్పడ్డారని, అడ్డువచ్చిన వార్డు సభ్యుడిపై దాడి చే సినట్లు తెలిపారు. తనతో పాటు వార్డుసభ్యుడిపై దాడి చేసిన శ్రీధర్‌రెడ్డి, దాడికి ప్రోత్సహించిన ప్రతాప్‌రెడ్డి, బెదిరించిన నర్సారెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సర్పంచ్ డిచ్‌పల్లి పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.
సర్పంచ్ రూప్‌సింగ్‌పై తాను దాడి చేయలేదని, దాడికి ప్రోత్సహించలేదని ఉపసర్పంచ్ ప్రతాప్‌రెడ్డి విలేకరులతో తెలిపారు.
గిరిజన సర్పంచ్ రూప్‌సింగ్‌పై ఉపసర్పంచ్ దాడి చేయించడం సిగ్గుచేటని మండల సర్పంచుల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు పాశం కుమార్, రవీందర్‌రెడ్డి అన్నారు. ఖిల్లా డిచ్‌పల్లి సర్పంచ్ రూప్‌సింగ్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని ఎస్సై శ్రీధర్‌గౌడ్ తెలిపారు. ఇరువర్గాలతో మాట్లాడి కేసు నమోదు చేస్తామని తెలిపారు.
సర్పంచ్, వార్డు సభ్యుడిపై దాడి
Published Sun, Jan 26 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
Advertisement
Advertisement