అపోలో ‘జియో’యాప్ ఆవిష్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: జీవన విధానంలో మార్పుల కారణంగా వచ్చే వ్యాధులనుంచి ప్రజలు తమను తాము కాపాడుకునేందుకు అపోలో లైఫ్ గ్రూపు ‘అపోలో జియో యాప్’ను గురువారం ఆవిష్కరించింది.
మారుతున్న జీవనశైలితో కేన్సర్, మధుమేహం వంటి వ్యాధులు పెరుగుతున్నాయని అపోలో గ్రూపు చైర్మన్ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. నటుడు, ‘అపోలో జియో’ బ్రాండ్ అంబాసిడర్ రామ్ చరణ్ తేజ ఈ యాప్‌ను తాను వ్యక్తిగతంగా వినియోగించానన్నారు. ఈ కార్యక్రమంలో అపోలో ైవైస్ ఛైర్ పర్సన్ ఉపాసనా కామినేని పాల్గొన్నారు.