తిరుపతి కేంద్రంగా ఆది వారం జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రశాం తంగా ముగిసింది. పేపర్-1, పేపర్-2 పరీక్షలకు మొ త్తం 20,040 మంది హాజరయ్యారు.
తిరుపతి, న్యూస్‌లైన్: జిల్లాలో తిరుపతి కేంద్రంగా ఆది వారం జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రశాం తంగా ముగిసింది. పేపర్-1, పేపర్-2 పరీక్షలకు మొ త్తం 20,040 మంది హాజరయ్యారు. వివిధ ప్రాంతాల్లోని మూడు పరీక్ష కేంద్రాల్లో ఇదివరకే ఉపాధ్యాయులుగా పనిచేస్తూ టెట్ రాస్తున్న ముగ్గురిని వారి వైఖరి అనుమానాస్పదంగా ఉండడంతో అధికారులు సస్పెండ్ చేసి విచారణ ప్రారంభించారు.
తిరుపతిలోని ఒక పరీక్షా కేంద్రంలో పైఅధికారుల అనుమతి లేకుండా ఎస్‌జీటీ పరీక్ష రాస్తున్న వీ.కోట ఉర్దూ జిల్లా పరిషత్ ఉన ్నత పాఠశాలకు చెందిన ఒక స్కూల్ అసిస్టెంట్‌ను డీఈవో సస్పెం డ్‌చేసి విచారణకు ఆదేశించారు. బంగారుపాళెంలో ఇదివరకే ఎస్‌జీటీగా పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు మళ్లీ టెట్(ఎస్‌జీటీ) పరీక్ష రాస్తుండగా అధికారులు గుర్తించి సస్పెండ్ చేశారు.
సదరు టీచర్ అదే సెంటర్ లో వెనక బెంచీలో పరీక్ష రాస్తున్న తన సోదరికి సహకారం అందించడానికి పరీక్షకు హాజరైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు పరీక్ష రాస్తున్న ఒక ఉపాధ్యాయుడు ఇది వరకే శ్రీకాళహస్తిలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండడంతో అనుమానం వచ్చి అధికారులు సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.
ఈ సంఘటనలు మినహా మొత్తం మీద టెట్ ప్రశాంతంగా జరిగింది. పేపర్-1 పరీక్ష నిర్వహణకు 16 కేంద్రాలను, పేపర్-2 అభ్యర్థుల కోసం 88 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్-1(డీఎడ్) పరీక్షను ఉదయం 9.30 గంటలకు, పేపర్-2 పరీక్షను మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించారు. పేపర్-1కు 3,657 మంది దరఖాస్తు చేసుకోగా 3,292 మంది హాజరయ్యారు. పేపర్-2కు 19,150 మంది దరఖాస్తు చేసుకోగా 16,748 మంది హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.