కేశినేని నాని మమ్మల్ని బతకనిచ్చేవారు కాదు | mp kesineni nani is threatening us, says orrange travels owner | Sakshi
Sakshi News home page

కేశినేని నాని మమ్మల్ని బతకనిచ్చేవారు కాదు

Published Mon, Mar 27 2017 8:54 AM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM

కేశినేని నాని మమ్మల్ని బతకనిచ్చేవారు కాదు

కేశినేని నాని మమ్మల్ని బతకనిచ్చేవారు కాదు

రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం చాలా మంచి అధికారి అని, ఆయనవల్లే తాము బస్సులు నడపగలుగుతున్నామని ఆరంజ్ ట్రావెల్స్ సంస్థ అధినేత సునీల్ రెడ్డి అన్నారు. అలాంటివాళ్లు లేకపోతే కేశినేని నాని తమను బతకనిచ్చేవారు కాదని చెప్పారు. టీడీపీ ఎంపీ అయిన కేశినేని నాని పెద్ద దొంగ అని, రూ. 9 కోట్ల సర్వీస్ టాక్స్ ఎగ్గొట్టారని ఆరోపించారు. తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫైనాన్స్ వ్యాపారులను బెదిరిస్తున్నారని, తన మూడు బస్సులపై అక్రమంగా కేసులు నమోదు చేయించారని ఆయన తెలిపారు. బస్సు ప్రమాదం కేసులో పోలీసుల మీద కూడా నాని ఒత్తిడి తెచ్చారన్నారు. తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలని అధికారులను బెదిరించారని చెప్పారు.

గత ఆరు నెలల నుంచి కేశినేని నాని తమను ఇబ్బంది పెడుతున్నారని, తామంతా కలిసి ఆయనను ఎంపీగా గెలిపించినా తనపై కక్ష పెట్టుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నాని కారణంగా ప్రైవేటు ట్రావెల్స్ అన్నీ దెబ్బతిన్నాయని, చాలామంది బస్సులు నడపడం మానేశారని వివరించారు. ఆయన లాంటి అహంకారులు ఎంపీగా ఉండటం విజయవాడ ప్రజల దురదృష్టమని సునీల్ రెడ్డి అన్నారు. తానే గొప్పవాడినని, మిగతావాళ్లు లేమీ చేయలేరని నాని విర్రవీగుతున్నారని మండిపడ్డారు. తాము అన్నిరకాల అనుమతులతో ధైర్యంగా బస్సులు నడుపుతున్నందునే తమ బస్సులను ఆయన టార్గెట్ చేశారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement