vijayawada mp
-
విజయవాడ ఎంపీగా పోటీచేస్తానన్న ప్రచారంలో నిజం లేదు : నాగార్జున
-
'టీడీపీ ఎంపీ కేశినేని నాని పెద్ద దొంగ'
-
కేశినేని నాని మమ్మల్ని బతకనిచ్చేవారు కాదు
-
కేశినేని నాని మమ్మల్ని బతకనిచ్చేవారు కాదు
రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం చాలా మంచి అధికారి అని, ఆయనవల్లే తాము బస్సులు నడపగలుగుతున్నామని ఆరంజ్ ట్రావెల్స్ సంస్థ అధినేత సునీల్ రెడ్డి అన్నారు. అలాంటివాళ్లు లేకపోతే కేశినేని నాని తమను బతకనిచ్చేవారు కాదని చెప్పారు. టీడీపీ ఎంపీ అయిన కేశినేని నాని పెద్ద దొంగ అని, రూ. 9 కోట్ల సర్వీస్ టాక్స్ ఎగ్గొట్టారని ఆరోపించారు. తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫైనాన్స్ వ్యాపారులను బెదిరిస్తున్నారని, తన మూడు బస్సులపై అక్రమంగా కేసులు నమోదు చేయించారని ఆయన తెలిపారు. బస్సు ప్రమాదం కేసులో పోలీసుల మీద కూడా నాని ఒత్తిడి తెచ్చారన్నారు. తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలని అధికారులను బెదిరించారని చెప్పారు. గత ఆరు నెలల నుంచి కేశినేని నాని తమను ఇబ్బంది పెడుతున్నారని, తామంతా కలిసి ఆయనను ఎంపీగా గెలిపించినా తనపై కక్ష పెట్టుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నాని కారణంగా ప్రైవేటు ట్రావెల్స్ అన్నీ దెబ్బతిన్నాయని, చాలామంది బస్సులు నడపడం మానేశారని వివరించారు. ఆయన లాంటి అహంకారులు ఎంపీగా ఉండటం విజయవాడ ప్రజల దురదృష్టమని సునీల్ రెడ్డి అన్నారు. తానే గొప్పవాడినని, మిగతావాళ్లు లేమీ చేయలేరని నాని విర్రవీగుతున్నారని మండిపడ్డారు. తాము అన్నిరకాల అనుమతులతో ధైర్యంగా బస్సులు నడుపుతున్నందునే తమ బస్సులను ఆయన టార్గెట్ చేశారని తెలిపారు. -
ఐపీఎస్ అధికారిపై బోండా తిట్ల పురాణం
-
అధికారులపై ఎంపీ కేశినేని నాని దుర్భాషలు
-
గడ్డి తింటున్నారా.. అధికారులపై ఎంపీ దుర్భాషలు
తెలుగుదేశం పార్టీ నాయకుల ఓవరాక్షన్‌తో అధికారులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. విజయవాడ ఆర్టీయే కార్యాలయం వద్ద శనివారం హైడ్రామా చోటుచేసుకుంది. రవాణా శాఖ కమిషనర్, డీటీసీలు అవినీతిపరులు అంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్రంగా ఆరోపించారు. గడ్డి తింటున్నారా అంటూ అధికారులను దుర్భాషలాడారు. కమిషనర్, డీటీసీలను ఘెరావ్ చేయడమే కాక.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా తదితరులు జతకలిశారు. అక్కడే ఉన్న ఒక కానిస్టేబుల్‌ను ఎమ్మెల్యే బోండా ఉమా నెట్టేశారు. ప్రైవేటు బస్సులకు అక్రమంగా అనుమతులు ఇస్తూ డబ్బులు దండుకుంటున్నారని, దానివల్ల ఆర్టీసీకి ఎంత నష్టం వస్తోందో మీకు తెలుసా అని కేశినేని నాని అధికారులపై మండిపడ్డారు. ప్రైవేటు బస్సులకు యాక్సిడెంట్లు జరిగితే ఆ నిందలు టీడీపీ ప్రభుత్వం మీద పడాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. తెలుగుదేశం పార్టీ నాయకుల తీరుతో రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. అయితే చివరకు కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంతో ఎంపీ కేశినేని నానికి క్షమాపణలు చెప్పించారు. దాంతో వివాదం సర్దుమణిగింది. -
'చిల్లర రాజకీయాలతో చిచ్చు పెట్టొద్దు'
విజయవాడ: ఆలయాల కూల్చివేతలపై బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. చిల్లర రాజకీయాలు చేసి మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టొద్దని బీజేపీ నేతలను కోరారు. ఆదివారం మధ్యాహ్నం కేశినేని నాని విలేకరులతో మాట్లాడుతూ... బీజేపీ నాయకులపై మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న విజయవాడలో వదంతులు సృష్టించి ఉద్రికత్తలు రేపుతున్నారని ఆరోపించారు. ఒక వ్యక్తి స్వార్థం కోసం ఇదంతా చేస్తున్నారని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో వందల ఆలయాలు తొలగించారని తెలిపారు. ఒక్క అహ్మదాబాద్ నగరంలోనే 80 గుళ్లను తొలగించారని వెల్లడించారు. అక్కడ చేస్తే ఒప్పు, ఇక్కడ చేస్తే తప్పా అని ప్రశ్నించారు. ప్రజలను ఒప్పించి అభివృద్ధి కోసం ఆలయాలను తొలగిస్తున్నామని చెప్పారు. బీజేపీ నేతలకు చేతనైతే ప్రత్యేక హోదా, రైల్వే జోన్ సాధించురావాలని సూచించారు. 'హిందూ మత పరిరక్షణ మీరొక్కరో చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వొద్దు' అంటూ బీజేపీ నేతలపై కేశినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుడు, సీఎం చంద్రబాబు అన్ని కులాలు, మతాలను సమానంగా చూస్తున్నారని చెప్పారు. తమ మీద పెత్తనం చెలాయిస్తే ఊరుకోమన్నారు. -
తొలగిస్తారా? తొలగించమంటారా? : ఎంపీ నాని
తొలగిస్తారా? తొలగించమంటారా? శనైశ్చరస్వామి ఆలయ నిర్వాహకులతో ఎంపీ నాని ఊరిబయట స్థలాలిస్తాం.. అక్కడే నిర్మించుకోండంటూ బేరం బెదిరించైనా స్థలాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం విజయవాడ : నగరంలోని ప్రముఖ ఆలయమైన శనైశ్చరస్వామి దేవస్థానాన్ని పూర్తిగా నేలమట్టం చేసేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇక్కడి దేవాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిని పూర్తిగా తొలగిస్తే.. ఊరిబయట కోరిన గ్రామాల్లో స్థలాలు ఇస్తామని, అక్కడ ఇదే దేవాలయాన్ని నిర్మించుకోవచ్చని నిర్వాహకులను ప్రలోభ పెడుతున్నారు. అందులో భాగంగానే శుక్రవారం ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) తన కార్యాలయానికి ఆలయ నిర్వాహకులను పిలిపించుకున్నారు. సేకరించిన వివరాల ప్రకారం గుడి వల్ల పార్కింగ్‌కు ఇబ్బంది ఉందని, గొల్లపూడిలో స్థలం కేటాయిస్తాం.. వెళ్లిపోతారా అని నాని నిర్వాహకులను ప్రశ్నించారు. ఇక్కడి ఆలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసేందుకు అనుమతిస్తే ఊరిబయట మీరు కోరిన గ్రామాల్లో స్థలాలు ఇస్తామని అక్కడ ఇదే దేవాలయాన్ని నిర్మించుకోవచ్చంటూ చెప్పారు. గుడిని తప్పనిసరిగా తీసివేయాలని, మీకు మీరుగా తీస్తారా? మమ్మల్ని తొలగించమంటారా? అని ప్రశ్నించారు. అవసరమైతే పుష్కరాలు ముగిశాక రాజీవ్‌గాంధీ పార్కుకు సమీపంలో తగిన స్థలం కేటాయించి గుడి నిర్మాణం చేయిస్తామని చెప్పారు. శనైశ్చరస్వామి ఆలయం జోలికి రాబోమని తొలుత హామీ ఇచ్చిన నేతలు ఇప్పుడు మాటమార్చడంతో అవాక్కైన నిర్వాహక కమిటీ దీనికి సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. ఈ నేపథ్యంలో శనైశ్చరాలయాన్ని పూర్తిగా కూల్చివేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గోశాల కనుమరుగు? గోశాలలోని 150 గోవులకు ప్రస్తుతం ఇంద్రకీలాద్రి గోడ పక్కగా ఇరుగ్గా ఉండే ప్రదేశాన్ని మాత్రమే ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఈ ప్రదేశాన్ని కూడా తీసుకుని, గోశాలను కొత్తురు తాడేపల్లికి తరలించేందుకు ఎంపీ కేశినేని శ్రీనివాస్, కలెక్టర్ బాబు.ఎ రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. గోశాల వెనుకవైపు ఇంద్రకీలాద్రిపై కొన్ని ఇళ్లు ఉన్నాయి. వారికి ఎన్టీఆర్ హయాంలో బీఫారం పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాల యజమానులకు ఒక్కొక్కరికి గజం రూ.53 వేలు చొప్పున దుర్గగుడి నుంచి ఇప్పించి వాటిని తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఆ ఇళ్లు తొలగించేటప్పుడే గోశాలను పూర్తిగా తొలగిస్తారని మల్లికార్జున పేటలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. గోశాలలోని ఒక వర్గం ఇప్పటికే నాయకుల బెదిరింపులకు లొంగిపోయింది. వీరితోనే చర్చలు జరిపి గోశాలను తొలగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. గోశాలను పూర్తిగా కొత్తూరు తాడేపల్లికి తరలించాలంటూ ఇప్పటికే నిర్వహకులపై ఒత్తిడి తెస్తున్నారు. -
త్వరలో సీఎం వద్దకు పంచాయితీ
స్ట్రాంవాటర్ డ్రెయినేజ్ పనులు పబ్లిక్ హెల్త్ విభాగానికి కట్టబెట్టిన మంత్రి నారాయణ! కార్పొరేషన్‌కే అప్పగించాలంటున్న ఎంపీ, ఎమ్మెల్యేలు విజయవాడ : స్ట్రాం వాటర్ డ్రెయినేజ్ (వరద నీరు) నిధులు తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపుతున్నాయి. ఎట్టకేలకు నిధుల్ని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం పనుల్ని పబ్లిక్ హెల్త్ విభాగానికి అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. మున్సిపల్ మంత్రి పి.నారాయణ ఒత్తిడి వల్లే పబ్లిక్ హెల్త్ విభాగానికి పనుల్ని కట్టబెడుతున్నట్లు సమాచారం. నగరపాలక సంస్థ చేపట్టాల్సిన పనుల్ని పబ్లిక్ హెల్త్ విభాగానికి అప్పగించడంపై స్థానిక ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. ఎంపీ కేశినేని నాని, తూర్పు, సెంట్రల్ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా, మేయర్ కోనేరు శ్రీధర్ ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. రాకరాక వచ్చిన నిధులు టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య కుమ్ములాటలకు దారితీయడం ఇప్పుడు కార్పొరేషన్లో హాట్ టాపిక్‌గా మారింది. చిన్నబుచ్చుకున్నారు స్ట్రాంవాటర్ డ్రెయిన్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మేలో రూ.461 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించింది. తొలివిడతగా రూ.110 కోట్లను విడుదల చేసింది. రాజధాని నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిధుల్ని తొక్కిపట్టింది. నిబంధనల నేపథ్యంలో ఎట్టకేలకు ఇటీవలే విడుదల చేసింది. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఎంపీ నాని, మేయర్ శ్రీధర్ చొరవ చూపారు. ఏ దశలోనూ కృషి చేయని మంత్రి నారాయణ ఇప్పుడు పెత్తనం చేయడాన్ని స్థానికనేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నగరాన్ని ఆరు జోన్లుగా విభజించి డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులు డిటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను ఇంజినీరింగ్ అధికారులు రూపొందించారు. 100 కి.మీ మేర పెద్ద డ్రెయిన్లు, 38 కి.మీ మేర చిన్న డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని గుర్తించారు. గుంటుతిప్ప, ప్రసాదంపాడు, పుల్లేరు డ్రెయిన్ల వద్ద రోడ్లు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పుడు పనుల్ని పబ్లిక్‌హెల్త్ విభాగానికి అప్పగించడంతో కార్పొరేషన్ అధికారులు చిన్నబుచ్చుకున్నారు. ఎందుకంత ప్రేమ! రూ.62 చదరపు కి.మీ విస్తీర్ణంలో విస్తరించిన నగరంలో వర్షం వస్తే లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. గంటల కొద్దీ నీరు రోడ్లపై నిలవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నగరంలోని 13 డివిజన్ల పరిధిలో 161 ఎకరాల్లో కొండలు విస్తరించి ఉన్నాయి. వీటిపై 40 వేల కుటుంబాలు ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నాయి. వర్షం వచ్చిన సమయంలో కొండ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ధాటికి రోడ్లు అతలాకుతలం అవుతున్నాయి. మురుగునీటి డ్రెయిన్లద్వారానే వర్షపునీరు ప్రవహించాల్సి వస్తోంది. దీనికి ఆ డ్రెయిన్ల సామర్థ్యం చాలక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వన్‌టౌన్, సర్కిల్-3లోని పలు ప్రాంతాల్లో ఈ సమస్యలతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈక్రమంలో స్ట్రాంవాటర్ డ్రెయిన్ల నిర్మాణం పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంది. పబ్లిక్‌హెల్త్ విభాగంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ ఒకరు, ఒక డీఈ, ఇద్దరు ఏఈలు మాత్రమే ఉన్నారు. ఎస్ఈ గుంటూరు జిల్లాలో ఉంటారు. నగరపాలక సంస్థలో చీఫ్ ఇంజినీర్, ఇద్దరు ఎస్ఈలు, 8 మంది ఈఈలు, 21మంది డీఈలు, 40 మంది ఏఈలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంతమంది అధికారులు కార్పొరేషన్లో ఉండగా పబ్లిక్‌హెల్త్ విభాగానికి పనుల బాధ్యతల్ని మంత్రి అప్పగించడం అనుమానాలకు తావిస్తోంది. అనుమానమే.. కేంద్రం నిధులతో చేపట్టబోయే పనుల్ని మూడేళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకుంటే నిధులు మురిగిపోతాయి. ప్రతి ఆరునెలలకు ఓ సారి నిధుల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపాల్సి ఉంటుంది. నిధుల వినియోగంలో తేడా ఉంటే కంట్రోలర్ ఆఫ్ ఆడిట్ జనరల్ (కాగ్) తప్పుబట్టే అవకాశం ఉంది. పబ్లిక్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో సకాలంలో పనులు పూర్తవుతాయనే నమ్మకం తమకు లేదన్నది స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయంగా తెలుస్తోంది. -
గ్రామాల అభివృద్ధిని మోదీ దృష్టికి తీసుకువెళ్లా
విజయవాడ: విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని 264 గ్రామాలను సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద అభివృద్ధి చేస్తామని స్థానిక ఎంపీ కేశినేని నాని వెల్లడించారు. గురువారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీని కలసిన అనంతరం కేశినేని నాని మాట్లాడుతూ... ఈ గ్రామాల అభివృద్ధి అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. సదురు గ్రామాల అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించాలని మోదీని ఆహ్వానించినట్లు కేశినేని నాని చెప్పారు. ఈ గ్రామాల అభివృద్ధికి టాటా ట్రస్ట్ ముందుకు వచ్చిందని ఈ సందర్భంగా కేశినేని నాని వెల్లడించారు. -
అలక పూనిన 'నాని'
మచిలీపట్నం : విజయవాడ ఎంపీ కేశినేని నాని అలక పూనారు. మంగళవారం మచిలీపట్నం కలెక్టరేట్లో జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హజరవుతున్న వారి జాబితాలో తన పేరు లేకపోవడంపై ఎంపీ కేశినేని నాని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి... అక్కడి నుంచి వెను తిరిగేందుకు ఆయన ఉద్యుక్తుడయ్యారు. ఇంతలో అక్కడే ఉన్న పార్టీ నేతలు ఆ విషయాన్ని ఆ సమావేశానికి హాజరైన మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ చెవిలో ఊదారు. అంతే ఆయన గబగబ బయటకు వచ్చి... బయటకు వెళ్లిపోతున్న నానిని సముదాయించి... సమావేశానికి రావాలని ఆహ్వానించారు. సమావేశానికి రానని నాని... నారాయణతో తెలిపాడు. నారాయణ తంటాలుపడి నానికి సర్థిచెప్పి సమావేశానికి తీసుకువెళ్లారు. -
పనిలో పోటీపడుతున్నారు ... అందుకే గొడవలు ...
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమకు, విజయవాడ ఎంపీ కేశినేని నానిల మధ్య విబేధాలు లేవని కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు. టీడీపీ నేతలు పనిలో పోటీ పడుతున్నారని.... అందుకే గొడవలు, మనస్పర్థలు చోటు చేసుకున్నాయని ఆయన వివరించారు. సోమవారం విజయవాడ వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బెస్ట్ స్టేట్‌గా తయారు చేస్తామని తెలిపారు. వారం రోజులో అధికారులందరి బదిలీ చేస్తామని చెప్పారు. ఎంపీలే కాదు, ఎమ్మెల్యేలు కూడా గ్రామాలను దత్తత తీసుకోవాలని సుజనా చౌదరి అన్నారు. -
ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: కేశినేని
-
బాబు... జీవిత కాలం సీఎంగా ఉండేందుకు కృషి చేస్తా
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు జీవిత కాలం సీఎంగా ఉండేందుకు కృషి చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేశినేని నాని మాట్లాడారు. నగరంలో అధికారులు, ప్రజా ప్రతినిధిల మధ్య సమన్వయలోపం ఉందని తాను వ్యాఖ్యానించి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లానన్నారు. ఆ వ్యవహారంపై కేంద్ర మంత్రి సుజనా చౌదరికి అప్పగిస్తానని బాబు తనకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. సుజనా త్వరలో విజయవాడ వచ్చి ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెస్తారని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు పార్టీని నడుపుతున్నారని అన్నారు. అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు చేపట్టారని వివరించారు. 24 గంటలు విద్యుత్ ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఏ వర్గాన్ని నిరాశపరచకుండా చంద్రబాబు పాలన సాగుతుందని తెలిపారు. కనకదుర్గ వారధికి కేంద్రం అనుమతి మంజూరు చేసిందని వెల్లడించారు. బెంజి సర్కిల్ వద్ద కూడా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టేందుకు త్వరలో అనుమతులు మంజూరు అయ్యేలా చర్యలు చేపటనున్నట్లు కేశినేని నాని ఆశాభావం వ్యక్తం చేశారు. -
'నాని ఆవేదన అర్థమైంది'
విజయవాడ: ఎంపీ కేశినేని నాని ఆవేదన తనకు అర్థమైందని ఏపీ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ శుక్రవారం విజయవాడలో అన్నారు. తమ మధ్య కొంత సమన్వయలోపం ఉన్న మాట వాస్తవమే అని ఆయన అంగీకరించారు. ఇక ముందు అందరం కలిసి నిర్ణయాలు తీసుకుని పని చేస్తామని నారాయణ చెప్పారు. మంత్రి పి. నారాయణ శుక్రవారం విజయవాడ నగరంలోని ఆటోనగర్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా స్థానిక ఎంపీ కేశినేని నాని ఉన్నతాధికారులు అనుసరిస్తున్న వైఖరిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఏ అంశంలోనూ దేవినేని ఉమ... తమను సంప్రదించడం లేదని కేశినేని నాని అసంతృప్తి వెలిబుచ్చారు. అలాగే అధికారులు కూడా ఏ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావటం లేదని విమర్శించారు. నగరంలో జరిగే ఏ విషయాల్లోనైనా మంత్రిని ఒక్కరినే సంప్రదిస్తే సరిపోదని... నగర ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా కలుపుకొని వెళ్లాలని సూచించారు. కేశినేని నాని వ్యాఖ్యలపై పి.నారాయణ పై విధంగా స్పందించారు. -
ఉమా మమ్మల్ని సంప్రదించడం లేదు: కేశనేని నాని
విజయవాడ : తెలుగుదేశం పార్టీలో విభేదాలు బయటపడుతున్నాయి. అధికార పార్టీ నేతలే ఒకరిపై మరొకరు విమర్శలకు దిగుతున్నారు. మంత్రులకు, ఎంపీలకు మధ్య సమన్వయం కుదరటం లేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశనేని నాని... ఇరిగేషన్ మినిష్టర్ దేవినేని ఉమమహేశ్వరరావుపై విరుచుకుపడ్డారు. దేవినేని ఉమ చెప్పినట్లే అధికారులు నడుచుకుంటున్నారని ఆయన శుక్రవారమిక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ విషయంలోనూ దేవినేని ఉమ ...తమను సంప్రదించటం లేదని కేశినేని నాని అసంతృప్తి వెలిబుచ్చారు. అధికారులు ఏ విషయాన్ని తమ దృష్టికి తీసుకు రావటం లేదని విమర్శించారు. సంబంధిత విషయాల్లో మంత్రిని ఒక్కరినే సంప్రదిస్తే సరిపోదని... ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా కలుపుకొని వెళ్లాలన్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనే లేని నైట్ డామినేషన్ బెజవాడలో ఎందుకుని కేశనేని నాని ప్రశ్నించారు. -
పీవీపీ ఎవరండీ... నేను ఎంపీగానే పోటీ చేస్తా..
-
లగడపాటిని ఏకాకి చేస్తారా?
అందరిదీ ఒకదారైతే ఉలిపి కట్టెది మరొకదారి అన్న నానుడి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సరిగ్గా సరిపోతుంది. ఆంధ్రా అక్టోపస్‌గా పేరుగాంచిన ఆయన పండగపూట 'తనదైన శైలి' ప్రదర్శించారు. హస్తినలో హడావుడి చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఎంపీ పదవికి తాను చేసిన రాజీనామాను ఎలాగైనా ఆమోదింపజేసుకుంటానని బీరాలు పలికి చివరకు తుస్సుమనిపించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు లగడపాటి ప్రకటించారు. దీన్ని ఇప్పటివరకు ఆమోదించకపోవడంతో స్పీకర్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రాజీనామాలు చేసిన తోటి ఎంపీలతో కలిసి అంతకుముందు స్పీకర్ ఆఫీస్‌కు వెళ్లిన లగడపాటి- దసరా రోజున మాత్రం ఒంటరిగా ముందడుగు వేశారు. తానొక్కడికే చిత్తశుద్ధి ఉన్నట్టు బిల్డప్ ఇచ్చారు. స్పీకర్ లేకపోవడంతో తన ఆవేదనను మీడియా ముందు వెళ్లబోసుకున్నారు. తన రాజీనామా ఆమోదం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దయాదాక్షిణ్యాలపై ఆధారపడివుందని లగడపాటి కుండబద్దలుకొట్టారు. వేరే రాష్ట్రాల ఎంపీలు రాజీనామా చేస్తే వెంటనే ఆమోదించారని, తమవి మాత్రంపెండింగ్లో పెట్టారని వాపోయారు. సీమాంధ్ర ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తే యూపీఏ ప్రభుత్వ బలం 213కు పడిపోతుందన్నారు. రాష్ట్రంలో సమన్యాయం ఎవరు కోరుకోవడం లేదని, సమైక్యాంధ్రే కావాలనుకుంటున్నారని చెప్పారు. మూడు ప్రాంతాలు అంగీకరిస్తేనే రాష్ట్ర విభజన చేయాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటును మూడు ప్రాంతాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి వెంటనే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. మరోవైపు సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు ఆమోదిస్తే యూపీఏ ప్రభుత్వానికి ముప్పు తప్పదన్న భయంతో కాంగ్రెస్ హైకమాండ్ సరికొత్త వ్యూహాలు పన్నుతోంది. సీఎం కిరణ్, సీనియర్ నేతలను అస్త్రాలుగా ప్రయోగించి రాజీనామాలపై వెనక్కు తగ్గేలా ఎంపీలపై ఒత్తిడి తేవాలని తలపోస్తున్నట్టు తెలుస్తోంది. దూకుడు ప్రదర్శిస్తున్న లగడపాటిని ఒంటరిని చేసేందుకు కూడా అధిష్టానం వెనుకాడదన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల దూకుడుకు కళ్లెం వేసిన కాంగ్రెస్ పెద్దలు తాజాగా ఎంపీలపై దృష్టి సారించినట్టు సమాచారం. ఎంపీలు రాజీనామాలకు కట్టుబడతారా, అధిష్టానంతో రాజీ పడతారా అనేది వేచి చూడాల్సిందే! -
ఎంపీ కనిపించడంలేదు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ :‘‘రాష్ట్ర విభజనను అడ్డుకుంటానంటూ బీరాలు పలికాడు.. టక్కుటమారాలతో మీడియాలో ప్రాచుర్యం పొందాడు.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముమ్మాటికీ ఒక్కటిగానే ఉంచుతుందని నమ్మబలికాడు.. ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు.. తీరా రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం పలికేసరికి పత్తాలేకుండాపోయాడు.. నమ్ముకున్న బెజవాడవాసుల ఆశలను వమ్ముచేసి ఢిల్లీ, హైదరాబాద్‌ల చుట్టూ తిరుగుతున్న ఆయన్ను పట్టి ప్రజలకు అప్పగించాలి.. పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయకుండా 16 రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న ఆయన ఆచూకీ తెలపండి’’ అంటూ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.. ఇది విజయవాడ నుంచి పరారై తిరుగుతున్న ఎంపీ లగడపాటి రాజగోపాల్ తీరుపై మండుతున్న సమైక్యాంధ్ర ఉద్యమకారుల గుండెచప్పుడు. మాటల గారడీ, సర్వేల జిమ్మిక్కులతో జనాన్ని బురిడీకొట్టించి కాలాన్ని నెట్టుకొస్తున్న రాజగోపాల్‌కు రాజకీయ సమాధి కడతామంటూ సమైక్యాంధ్ర రాజకీయ విద్యార్థి కో-కన్వీనర్ గాలి సూర్యనారాయణరెడ్డి సోమవారం ప్రకటించారు. అమ్మా రాజగోపాల్ కనిపించాడా.. అయ్యా లగడపాటి తారసపడ్డారా.. అంటూ విజయవాడ నగరంలోని ప్రధాన వీధుల్లో వెతుకుతూ అందరిదీ ఆరా తీస్తూ ఎంపీ తీరుపై మంగళవారం సరికొత్త నిరసనోద్యమం జరగనుంది. ఈ క్రమంలో విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం నుంచి ఊరేగింపు జరిపేందుకు నిర్ణయించారు. -
'సమైక్యంగా ఉంచకుంటే రాజకీయలకు గుడ్ బై '
యూపీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. తమ పదవులకు రాజీనామా చేయడం అంత పెద్ద విషయం కాదని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు కూడా రాజీనామాలు చేసేందుకు సిద్ధంగానే ఉన్నారని తెలిపారు. పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలను సస్పెన్షన్ చేసిన సభను సజావుగా సాగకుండా తమ సమైక్యాంధ్రకు మద్దతుగా సమైక్య గళం వినిపించిన సంగతిని లగడపాటి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామా చేసిన పక్షంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే అడ్డుకునే వారు ఎవరు ఉండని ఆయన పేర్కొన్నారు. దాంతో వేర్పాటువాదులకు తమ రాజీనామా ఓ వరంలో మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ఎవ్వరు తమ పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామాలు చేయలేదని లగడపాటి తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్శిటీ విద్యార్థులు లగడపాటి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లగడపాటి పై విధంగా స్పందించారు. -
ఆర్టీసి కార్మికుల దీక్ష శిబిరానికి వచిన లగడపాటి
-
సొంతగడ్డపై లగడపాటికి సమైక్య సెగ
-
సొంతగడ్డపై లగడపాటికి సమైక్య సెగ
ఏపీ ఎన్జీవోస్ దీక్షా శిబిరం వద్ద విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు చేదు అనుభవం ఎదురయింది. ఆయనను సమైక్యవాదులు అడ్డుకున్నారు. గో బ్యాక్ లగడపాటి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పదవికి రాజీనామా చేసిన తర్వాతే ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. విద్యార్థి గర్జనలో పాల్గొన్న అనంతరం బందరు రోడ్డులో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని లగడపాటి సందర్శించారు. కార్మికులతో కలిసి దీక్షలో కూర్చుకున్నారు. కొంపసేపటికి దీక్షా శిబిరంలో కలకలం రేగింది. గో బ్యాక్ లగడపాటి అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. రాజీనామా చేసిన తర్వాతే ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని లగడపాటిని డిమాండ్ చేశారు. దీంతో లగడపాటి రాజగోపాల్ దీక్షా శిబిరం నుంచి వెళ్లిపోయారు. తనకు జరిగిన అవమానంపై బందరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు ఆయనతో చర్చలు జరిపి శాంతింప జేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.