రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం చాలా మంచి అధికారి అని, ఆయనవల్లే తాము బస్సులు నడపగలుగుతున్నామని ఆరంజ్ ట్రావెల్స్ సంస్థ అధినేత సునీల్ రెడ్డి అన్నారు. అలాంటివాళ్లు లేకపోతే కేశినేని నాని తమను బతకనిచ్చేవారు కాదని చెప్పారు. టీడీపీ ఎంపీ అయిన కేశినేని నాని పెద్ద దొంగ అని, రూ. 9 కోట్ల సర్వీస్ టాక్స్ ఎగ్గొట్టారని ఆరోపించారు.