గ్రామాల అభివృద్ధిని మోదీ దృష్టికి తీసుకువెళ్లా | kesineni nani meet with narendra modi | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధిని మోదీ దృష్టికి తీసుకువెళ్లా

Published Thu, Apr 30 2015 11:08 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

గ్రామాల అభివృద్ధిని మోదీ దృష్టికి తీసుకువెళ్లా

గ్రామాల అభివృద్ధిని మోదీ దృష్టికి తీసుకువెళ్లా

విజయవాడ: విజయవాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 264 గ్రామాలను సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద అభివృద్ధి చేస్తామని స్థానిక ఎంపీ కేశినేని నాని వెల్లడించారు. గురువారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీని కలసిన అనంతరం కేశినేని నాని మాట్లాడుతూ... ఈ గ్రామాల అభివృద్ధి అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. సదురు గ్రామాల అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించాలని మోదీని ఆహ్వానించినట్లు కేశినేని నాని చెప్పారు. ఈ గ్రామాల అభివృద్ధికి టాటా ట్రస్ట్ ముందుకు వచ్చిందని ఈ సందర్భంగా కేశినేని నాని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement