
మరో ప్రేమికుడు!
‘‘ప్రతి ఒక్కరి లైఫ్‌లో ప్రేమ అనేది మర్చిపోలేని అనుభూతి. వినూత్న కథ, చక్కని సంగీతంతో ఆహ్లాదంగా సాగిపోయే యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ఇది. వినోదంతో ఎంటర్‌టైన్ చేస్తూ, ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది. కథలోని పాత్రల్లో యువతరం తమను తాము చూసుకుంటారు’’ అని దర్శకుడు ‘కళా’ సందీప్ తెలిపారు.
మానస్, సనమ్ శెట్టి జంటగా డిజి పోస్ట్ సమర్పణలో ఎస్‌ఎస్ సినిమా పతాకంపై లక్ష్మి నారాయణరెడ్డి, కె. ఇసనాక సునీల్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘ప్రేమికుడు’. పాటలను ఈనెల 13న విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఇప్పటి యువతకు కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నెలలో పాటలను, వేసవిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, కెమేరా: శివ కె, సహ నిర్మాత: వరికుంట్ల సురేశ్‌బాబు(రాజ).