Actress Poonam Bajwa: Poonam Bajwa Introduced Her Boy Friend Sunil Reddy - Sakshi
Sakshi News home page

ప్రియుడిని పరిచయం చేసిన పూనమ్‌

Published Thu, Oct 29 2020 4:15 PM | Last Updated on Thu, Oct 29 2020 5:57 PM

Actress Poonam Bajwa Introduced Boy Friend Sunil Reddy - Sakshi

దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించిన నటి పూనమ్‌ బజ్వా.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. పూనమ్‌ తెలుగులో నటించిన ‘మొదటి సినిమా’తోనే తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ప్రేమంటే ఇంతే, బాస్‌, వేడుక, పరుగు వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్‌ అభిమానులకు చేరువయ్యారు. అనంతరం  తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడంతో తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించారు. మళ్లీ ఇటీవల బాలకృష్ణ ప్రధాన పాత్రలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీర్‌ కథానాయకుడు ’సినిమాలో అతిధి పాత్రలో కనిపించారు. చదవండి: సాయి పల్లవికి బంఫర్‌ ఆఫర్..

తాజాగా ఈ భామ సోషల్‌ మీడియాలో చేసిన పోస్టు ఆమె అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పూనమ్‌ తనకు కాబోయే భర్తను పరిచయం చేశారు. బుధవారం ప్రియుడు సునీల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను షేర్‌చేస్తూ రిలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ‘ పుట్టినరోజు శుభాకాంక్షలు సునీల్‌ రెడ్డి. అందమైన వ్యక్తి, జీవిత భాగస్వామి, నా కలలకు రెక్కలు ఇచ్చిన వ్యక్తి, నా ఆనందం, ఉత్సాహం, నా సర్వస్వం నువ్వే. నీతో కలిసి ఉండే ప్రతి మూమెంట్‌ ఓ మ్యాజిక్‌లా ఉంటుంది. నీ జీవితంలో ప్రేమ, ఫన్‌, సంతోషం, ఆరోగ్యం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. నిన్ను మాటల్లో చెప్పలేనంతంగా ప్రేమిస్తున్నాను’ అంటూ ప్రియుడిని పొగడ్తాలతో ముంచేస్తూ కామెంట్‌ చేశారు. మెహందీ వేడుక అయిపోంది.. ఇవాళ హల్ది ఫంక్షన్‌

ఇక వీరి ప్రేమను చూసిన అభిమానులు మాత్రం  సర్​ప్రైజ్​ అవుతున్నారు. కాగా పూనమ్‌ పోస్ట్‌కు నెటిజన్స్‌తోపాటు సినీ సెలబ్రిటీస్ సందీప్‌ కిషన్‌, కామ్నా జఠ్మలానీ, ఆర్తి చబ్రియా తదితరులు స్పందిస్తూ నటికి బెస్ట్ విషెస్ చెప్పారు. ఇదిలా ఉండగా పూనమ్ బజ్వా చివరిసారిగా కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ దర్శకత్వంలో తమిళ చిత్రం ‘కుప్పతు రాజా’లో కనిపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement