కారులో కయ్యుం | TRS party leaders struggleing for tickets | Sakshi
Sakshi News home page

కారులో కయ్యం

Published Sat, Mar 15 2014 2:35 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM

TRS party leaders struggleing for tickets

గులాబీ దండులో టికెట్ల లొల్లి మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘనతను ప్రచారాస్త్రంగా వులుచుకొని అధికారం చేపట్టాలని తహతహలాడుతున్న  టీఆర్‌ఎస్‌లో అంతర్గత పోరు రాజుకుంటోంది. జిల్లాలో రెండు ఎంపీ స్థానాలతో పాటు 13 అసెంబ్లీ నియోజకవర్గాలున్నారుు. అన్ని చోట్ల టికెట్లను ఆశిస్తున్నవారు రోజురోజుకు పెరిగిపోతుండడంతో గొడవలు వుుదురుతున్నారుు.       
 
 
 కొత్తవాళ్లకు టికెట్లు ఇస్తే ఊరుకొనేది లేదని.. సావుూహికంగా రాజీనావూలు చేస్తావుని తాజాగా మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి హెచ్చరించారు. దీంతో టీఆర్‌ఎస్ టికెట్ల పోరు బజారుకెక్కింది. మంథని నుంచి రాంరెడ్డి, ఆయన తనయుడు సునీల్‌రెడ్డి పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. తవుకే టికెట్ వస్తుందని నమ్మకంతో ఉన్న రాంరెడ్డి కుటుంబానికి, అదేస్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పుట్ట మధు టీఆర్‌ఎస్‌లో చేరుతుండడం ఇబ్బందిగా మారింది.

కేసీఆర్‌తో పాటు ముఖ్య నేతలతో వుధు చర్చలు జరపడం, పార్టీ కూడా ఆయనకు టిక్కెటు ఇచ్చేం దుకు మొగ్గు చూపుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇంతకాలం ఉద్యవుంతో పాటు పార్టీకి పని చేసిన తవుకు నచ్చజెప్పేందుకు పార్టీ నేతలు చేస్తున్న ప్రయుత్నాలతో రాంరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. అందుకే పార్టీకి అల్టిమేటమ్ జారీ చేశారు.
 
 రామగుండంలోనూ అదే పరిస్థితి నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కోరుకంటి చందర్ పార్టీ టికెట్ కోసం పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లో కోరుకంటి చందర్ టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేయగా, పొత్తును ఉల్లంఘించి సోమారపు సత్యనారాయణ టీడీపీ నుంచి నామినేషన్ వేయడానికి రావడం, సకాలంలో బీ-ఫారం అందచేయకపోవడంతో స్వతంత్రుడిగా బరిలోకి దిగి విజయం సాధించడం తెలిసిందే. ఈసారి ఇరువురు ఒకే పార్టీలో ఉన్నా సమాంతరంగా గ్రూపులకు సారథ్యం వహిస్తున్నారు.
 
   చొప్పదండి నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి బొడిగె శోభ టికెట్ ఆశిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య టీఆర్‌ఎస్‌లోకి వస్తారని, లేదంటే టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సువున్‌కు టికెట్ వస్తుందనే ప్రచారంతో శోభ పార్టీపై గుర్రుగా ఉన్నారు.
 
  జగిత్యాలలో నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.జితేందర్‌రావు, వి.రమణారావుల నడుమ టికెట్ కోసం పోరు కొనసాగుతోంది.
 
  కోరుట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు టికెట్ తనకే అనే ధీమాతో ఉండగా, టీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ సైతం ఇదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ సీటు బీసీ వుహిళకు రిజర్వు కావటంతో ఆమెను జెడ్పీటీసీకి పోటీ చేసేలా పార్టీ నేతలు రూటు వుళ్లించారు.
 
  మానకొండూరు నుంచి మరోసారి టికెట్ తనకే అని నియోజకవర్గ ఇన్‌చార్జి ఓరుగంటి ఆనంద్ ధీమాతో ఉండగా, ధూంధాం కళాకారుడు రసమయి బాలకిషన్ తెరపైకి వచ్చారు. కాంగ్రెస్ కూడా రసవురుుని పార్టీలోకి ఆహ్వానిస్తుండటంతో ఆనంద్ సందిగ్ధంలో ఉన్నారు.
 
  పెద్దపల్లిలో నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి వునోహర్‌రెడ్డికి టికెట్ ఇస్తున్నట్లు పార్టీ నేత టి.హరీష్‌రావు ఇటీవల ప్రకటించడంతో, అదే స్థానాన్ని ఆశిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి అంతర్గతంగా నేతల వైఖరిపై ఫైర్ అయ్యారు. ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని, తాము కూడా రేసులో ఉన్నామని కరీంనగర్‌లో పార్టీ సీనియర్ నేతలతో వాదనకు దిగారు.
 
 పార్టీలో ఉన్న వాళ్లతోనే ఈ సమస్యలు ఉండగా, కొత్తగా పార్టీలోకి వస్తున్న వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండడంతో, టికెట్ల లొల్లి జయాపజయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలో పార్టీ నాయకత్వం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement