ప్రభుత్వ ఓఎంసీలతో ప్రైవేట్ రిఫైనరీల ఒప్పందం
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ కొనుగోళ్ల కోసం ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ)-ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలు ప్రైవేట్ రిఫైనరీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్సార్ ఆయిల్ కంపెనీలతో తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఉత్పత్తి కొరత కారణంగా ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలు 12 మిలియన్ టన్నుల డీజిల్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ జామ్ నగర్ రిఫైనరీ, ఎస్సార్ ఆయిల్ వాదినర్ రిఫైనరీల నుంచి ప్రతి ఏటా కొనుగోలు చేస్తాయి. ఈ రెండు కంపెనీలు ఇంధనాలను తమ గుజరాత్ ప్లాంట్ల నుంచి ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లకు సరఫరా చేసేవి. దీనికి గాను కేంద్ర అమ్మకపు పన్ను, తీర రవాణా వ్యయాలను ప్రైవేట్ కంపెనీలే భరించేవి. అయితే దీన్ని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలే భరించాలని ఈ ప్రైవేట్ రిపైనరీ కంపెనీలు కోరడంతో ఈ ఒప్పందం ఈ ఏడాది మొదట్లో నిలిచిపోయింది.