'హెచ్పీసీఎల్ దుర్ఘటనతో ఉత్పత్తిపై ప్రభావం' | Production effect on HPCL accident incident, says HPCL CMD Roy choudary | Sakshi
Sakshi News home page

'హెచ్పీసీఎల్ దుర్ఘటనతో ఉత్పత్తిపై ప్రభావం'

Published Mon, Aug 26 2013 10:52 AM | Last Updated on Thu, Jul 11 2019 8:34 PM

Production effect on HPCL accident incident, says HPCL CMD Roy choudary

నగరంలోని హెచ్పీసీఎల్ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి రూ. 20 లక్షల పరిహారం అందజేస్తామని ఆ సంస్థ సీఎండీ రాయ్ చౌదరి సోమవారం విశాఖపట్నంలో వెల్లడించారు. ప్రమాద స్థలాన్ని ఆయన సోమవారం సందర్శించారు. అనంతరం హెచ్పీసీఎల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటువంటి తరహా ప్రమాదం దేశంలో ఇంతకు ముందు ఎన్నడు చోటు చేసుకోలేదని అన్నారు. ఆ ప్రమాదం ఏలా జరిగింది అనేది తమకు ఊహాకు అందడం లేదని పేర్కొన్నారు.

 

హెచ్పీసీఎల్ దుర్ఘటన ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోందని తెలిపారు. నగరంలోని హెచ్పీసీఎల్ రిఫైనరిపై అంతర్జాతీయ నిపుణులతో మదింపు చేయిస్తామని ఆ సంస్థ సీఎండీ రాయ్ చౌదరి చెప్పారు. అయితే హెచ్పీసీఎల్ ప్రమాదంలో గల్లంతైన వారి వివరాలు స్పష్టంగా ప్రకటించకపోవడంపై ఆ సంస్థలోని కార్మిక సంఘాలు యాజమాన్యంపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్పీసీఎల్ బంద్కు కార్మిక సంఘలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement