Rs 20 lakhs
-
భోజనశాల నిర్మాణానికి రూ.20 లక్షల విరాళం
అమరావతి : గ్రామీణ ప్రాంత పాఠశాలలు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో మండల పరిధిలోని నరుకుళ్లపాడుకు చెందిన ప్రవాసాంధ్రుడు, పాఠశాల పూర్వ విద్యార్థి తుమ్మల సురేష్ శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్లో విద్యార్థుల భోజనశాల నిర్మాణానికి రూ.20 లక్షల విరాళాన్ని అందజేశారు. బుధవారం భోజనశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరావతి పరిసర ప్రాంతాల పేద విద్యార్థులకు 70 సంవత్సరాలుగా ఉత్తమ విద్యను అందిస్తుందన్న శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్లో తామంతా చదువుకున్నామని తెలిపారు. తుమ్మల సురేష్ పాఠశాల అభివృద్ధి రూ.20 లక్షల చెక్కులను పాఠశాల కరస్పాండెంట్ మల్లెల శ్రీనాథ్చౌదరికి అందించారు. -
'హెచ్పీసీఎల్ దుర్ఘటనతో ఉత్పత్తిపై ప్రభావం'
నగరంలోని హెచ్పీసీఎల్ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి రూ. 20 లక్షల పరిహారం అందజేస్తామని ఆ సంస్థ సీఎండీ రాయ్ చౌదరి సోమవారం విశాఖపట్నంలో వెల్లడించారు. ప్రమాద స్థలాన్ని ఆయన సోమవారం సందర్శించారు. అనంతరం హెచ్పీసీఎల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటువంటి తరహా ప్రమాదం దేశంలో ఇంతకు ముందు ఎన్నడు చోటు చేసుకోలేదని అన్నారు. ఆ ప్రమాదం ఏలా జరిగింది అనేది తమకు ఊహాకు అందడం లేదని పేర్కొన్నారు. హెచ్పీసీఎల్ దుర్ఘటన ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోందని తెలిపారు. నగరంలోని హెచ్పీసీఎల్ రిఫైనరిపై అంతర్జాతీయ నిపుణులతో మదింపు చేయిస్తామని ఆ సంస్థ సీఎండీ రాయ్ చౌదరి చెప్పారు. అయితే హెచ్పీసీఎల్ ప్రమాదంలో గల్లంతైన వారి వివరాలు స్పష్టంగా ప్రకటించకపోవడంపై ఆ సంస్థలోని కార్మిక సంఘాలు యాజమాన్యంపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్పీసీఎల్ బంద్కు కార్మిక సంఘలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.