హెచ్‌పీసీఎల్ నుంచి క్లబ్ హెచ్‌పీ స్టార్ అవుట్‌లెట్లు | Hindustan Petroleum launches Club HP Star outlets | Sakshi
Sakshi News home page

హెచ్‌పీసీఎల్ నుంచి క్లబ్ హెచ్‌పీ స్టార్ అవుట్‌లెట్లు

Published Fri, Mar 28 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM

హెచ్‌పీసీఎల్ నుంచి క్లబ్ హెచ్‌పీ స్టార్ అవుట్‌లెట్లు

హెచ్‌పీసీఎల్ నుంచి క్లబ్ హెచ్‌పీ స్టార్ అవుట్‌లెట్లు

న్యూఢిల్లీ: ఉత్తమమైన ఇంధనం అందించడం లక్ష్యంగా హిందూస్తాన్ పెట్రోలియం కార్పొ(హెచ్‌పీసీఎల్) గురువారం క్లబ్ హెచ్‌పీ స్టార్ అవుట్‌లెట్లను ప్రారంభించింది. మరో నాలుగు రోజుల్లో ఈ అవుట్‌లెట్లను హైదరాబాద్, వైజాగ్‌ల్లో కూడా ప్రారంభిస్తామనిహెచ్‌పీసీఎల్ సీఎండీ నిషి వాసుదేవ చెప్పారు.  తొలి  క్లబ్ హెచ్‌పీ స్టార్ పెట్రోల్ పంప్‌ను  ముంబైలో ఆయన ప్రారంభించారు. 2002లో  క్లబ్ హెచ్‌పీ బ్రాండ్ కింద రిటైల్ అవుట్‌లెట్లను ప్రారంభించామని, ఇప్పుడు ప్రారంభిస్తున్న  క్లబ్ హెచ్‌పీ స్టార్ అనేది వాటికి ప్రీమియం వెర్షన్ అని వాసుదేవ వివరించారు.

ఈ అవుట్‌లెట్లన్నీ పూర్తిగా ఆటోమేటెడ్‌గా ఉంటాయని, ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా ఎలక్ట్రానిక్ బిల్లింగ్ ఉంటుందని పేర్కొన్నారు. సమయయే సొమ్మని భావిస్తామని, అందుకే ఈ అవుట్‌లెట్లలో  సత్వరంగా సర్వీసులనందిస్తామని వివరించారు. మరో నాలుగు రోజుల్లో హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, ఢిల్లీ, నోయిడా, అహ్మదాబాద్, చెన్నైల్లో వీటిని ప్రారంభిస్తామని వాసుదేవ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement