
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియమ్ కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో 147 శాతం వృద్ధి చెందింది. గత క్యూ2లో రూ.701 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,735 కోట్లకు పెరిగిందని హెచ్‌పీసీఎల్ తెలిపింది. ఉత్పత్తి అధికంగా ఉండడం, రిఫైనరీ మార్జిన్ దాదాపు రెట్టింపుకు పైగా పెరగడం, అధిక ఇన్వెంటరీ లాభాలు, దేశీయ అమ్మకాలు అధికంగా ఉండడం తదితర అంశాల కారణంగా ఈ స్థాయి నికర లాభం సాధించామని కంపెనీ సీఎండీ ముకేశ్ కె. సురానా చెప్పారు.
ఒక బ్యారెల్ చమురును ఇంధనంగా మార్చే విషయంలో గత క్యూ2లో 3.23 డాలర్ల రిఫైనరీ మార్జిన్ సాధించామని, ఈ క్యూ2లో అది 7.61 డాలర్లకు పెరిగిందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ రిఫైనరీ ఉత్పత్తి సామర్థ్యాన్ని 8.33 మిలియన్ టన్నుల నుంచి 2020 కల్లా 15 మిలియన్ టన్నులకు పెంచనున్నామని, దీని కోసం రూ.20,928 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment