బిగ్‌హాట్‌తో ఎంఐబీఎల్‌ జత | Mahindra Insurance Brokers partners with BigHaat | Sakshi
Sakshi News home page

బిగ్‌హాట్‌తో ఎంఐబీఎల్‌ జత

Published Thu, Jun 23 2022 3:12 AM | Last Updated on Thu, Jun 23 2022 5:56 AM

Mahindra Insurance Brokers partners with BigHaat - Sakshi

ముంబై: అగ్రి డిజిటల్‌ ప్లాట్‌ఫాం బిగ్‌హాట్‌తో చేతులు కలిపినట్లు మహీంద్రా ఇన్సూరెన్స్‌ బ్రోక ర్స్‌ (ఎంఐబీఎల్‌) వెల్లడించింది. దేశీయంగా అసంఘటిత వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఆర్థిక సేవలు అందించేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని పేర్కొంది. అలాగే కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ భారతంలో బీమాను మరింత విస్తృతం చేసేందుకు కూడా ఉపయోగపడగలదని వివరించింది.

ఈ భాగస్వామ్యం కింద బిగ్‌హాట్‌ కస్టమర్లకు ఎంఐబీఎల్‌ హెల్త్, మోటర్‌ పాలసీలను విక్రయించనుంది. హెల్త్‌ పాలసీలో రూ. 5 లక్షల వరకూ సమ్‌ ఇన్షూర్డ్‌ ఉంటుందని ఎంఐబీఎల్‌ ఎండీ వేదనారాయణన్‌ శేషాద్రి తెలిపారు. తమ ప్లాట్‌ఫాంలో ఉన్న కోటి మంది పైగా రైతులకు ఆరోగ్య బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడగలదని బిగ్‌హాట్‌ ఇండియా సహ వ్యవస్థాపకుడు సతీష్‌ నూకాల పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement