Mahindra Insurance Company
-
బిగ్హాట్తో ఎంఐబీఎల్ జత
ముంబై: అగ్రి డిజిటల్ ప్లాట్‌ఫాం బిగ్హాట్తో చేతులు కలిపినట్లు మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోక ర్స్ (ఎంఐబీఎల్) వెల్లడించింది. దేశీయంగా అసంఘటిత వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఆర్థిక సేవలు అందించేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని పేర్కొంది. అలాగే కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ భారతంలో బీమాను మరింత విస్తృతం చేసేందుకు కూడా ఉపయోగపడగలదని వివరించింది. ఈ భాగస్వామ్యం కింద బిగ్‌హాట్ కస్టమర్లకు ఎంఐబీఎల్ హెల్త్, మోటర్ పాలసీలను విక్రయించనుంది. హెల్త్ పాలసీలో రూ. 5 లక్షల వరకూ సమ్ ఇన్షూర్డ్ ఉంటుందని ఎంఐబీఎల్ ఎండీ వేదనారాయణన్ శేషాద్రి తెలిపారు. తమ ప్లాట్‌ఫాంలో ఉన్న కోటి మంది పైగా రైతులకు ఆరోగ్య బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడగలదని బిగ్‌హాట్ ఇండియా సహ వ్యవస్థాపకుడు సతీష్ నూకాల పేర్కొన్నారు. -
మహీంద్రా ఇన్సూరెన్స్ కంపెనీకి బ్రోకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్
హైదరాబాద్: మహీంద్రా గ్రూప్‌కు చెందిన మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ కంపెనీ(ఎంఐబీఎల్)కి బ్రోకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ లభించింది. తైవాన్‌లోని తైపీలో ఇటీవల జరిగిన 18వ ఆసియా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ అవార్డ్ ప్రదానోత్సవం జరిగిందని మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డ్‌ను తమ వినియోగదారులందరికీ అంకితం చేస్తున్నామని కంపెనీ ఎండీ. జైదీప్ దేవ్రే పేర్కొన్నారు. లక్ష గ్రామాలకు విస్తరించామని, 40 లక్షలకు మందికి పైగా బీమా సర్వీసులను అందిస్తున్నామని వివరించారు. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డ్ లభించినందుకు ఎంఐబీఎల్ ఉద్యోగులను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అభినందించారు.