హైదరాబాద్: మహీంద్రా గ్రూప్‌కు చెందిన మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ కంపెనీ(ఎంఐబీఎల్)కి బ్రోకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ లభించింది. తైవాన్‌లోని తైపీలో ఇటీవల జరిగిన 18వ ఆసియా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ అవార్డ్ ప్రదానోత్సవం జరిగిందని మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ అవార్డ్‌ను తమ వినియోగదారులందరికీ అంకితం చేస్తున్నామని కంపెనీ ఎండీ. జైదీప్ దేవ్‌రే పేర్కొన్నారు. లక్ష గ్రామాలకు విస్తరించామని, 40 లక్షలకు మందికి పైగా బీమా సర్వీసులను అందిస్తున్నామని వివరించారు. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డ్ లభించినందుకు ఎంఐబీఎల్ ఉద్యోగులను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అభినందించారు.
మహీంద్రా ఇన్సూరెన్స్ కంపెనీకి బ్రోకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్
Published Sat, Nov 8 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM
Advertisement
Advertisement