బీజింగ్: చైనా, తైవాన్ మధ్య మరోసారి యుద్ద వాతావరణం నెలకొంది. తాజాగా చైనాకు చెందిన సైనిక విమానాలు, నౌకలు తైవాన్ భూభాగంలోకి వెళ్లినట్టు తైవాన్ తెలిపింది. మరోవైపు.. యుద్ధానికి సిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తమ దేశ సైనికులకు పిలుపునిచ్చినట్లు సమాచారం. దీంతో, రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 6 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) చైనాకు చెందిన ఆరు సైనిక విమానాలు, ఏడు నౌకాదళ నౌకలు తైవాన్ భూభాగంలో గుర్తించబడ్డాయి. రెండు విమానాలు మధ్యస్థ రేఖను దాటి తైవాన్ నైరుతి వైమానిక రక్షణ గుర్తింపు జోన్‌లోకి ప్రవేశించాయి. దీంతో, రక్షణ శాఖ అప్రమత్తమైందని తెలిపింది. ఇక, తైవాన్ చుట్టూ బీజింగ్ తరచుగా సైనిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా..ఇటీవల పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్‌కు చెందిన బ్రిగేడ్‌ను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ.. యుద్ధానికి సన్నాహాలను సమగ్రంగా బలోపేతం చేయాలి. దళాలు పటిష్ఠమైన పోరాట సామర్థ్యాలను కలిగి ఉండేలా చూడాలి. సైనికులు తమ వ్యూహాత్మక పోరాట సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. దేశ భద్రత, ప్రధాన ప్రయోజనాలను కాపాడాలని సైన్యానికి సూచించినట్లు చైనా వార్తా సంస్థలు తెలిపాయి.
URGENT 🇨🇳 President Chino Xi Jinping orders his troops to prepare for war, visits installations and requests an increase in missile production as soon as possible. This appeared in the national broadcast on the state channel CCTV pic.twitter.com/9HXfSMMyLI
— Nostr World (@newsandworld) October 20, 2024
Comments
Please login to add a commentAdd a comment