న్యూఢిల్లీ: దేశీ ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీలో ఫ్రెంచ్ దిగ్గజం టోటల్‌ఎనర్జీస్ 30 కోట్ల డాలర్లు(సుమారు రూ. 2,500 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. తద్వారా పునరుత్పాదక ఇంధన భాగస్వామ్య సంస్థ(జేవీ)లో సమాన వాటా తీసుకుంది. అదానీ రెనెవబుల్ ఎనర్జీ నైన్ లిమిటెడ్(ఏఆర్‌ఈ9ఎల్) పేరుతో జేవీని ఏర్పాటు చేశాయి. 1,050 మెగావాట్ల ప్రాజెక్ట్ పోర్ట్‌ఫోలియోగల జేవీలో అదానీ గ్రీన్, టోటల్‌ఎనర్జీస్ 50:50 శాతం చొప్పున వాటాను తీసుకున్నాయి. అదానీ గ్రీన్‌కు ఏఆర్‌ఈ9ఎల్ అనుబంధ సంస్థకాగా.. 300 మెగావాట్ల నిర్వహణా సామర్థ్యంతోపాటు, 500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.
మరో 250 మెగావాట్ల ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉన్నట్లు అదానీ గ్రీన్ వెల్లడించింది. అదానీ గ్రీన్‌లో 19.75 శాతం వాటా కలిగిన టోటల్‌ఎనర్జీస్ గతంలో అదానీ గ్రీన్ ఎనర్జీ ట్వంటీ త్రీ(ఏజీఈ23) లిమిటెడ్‌లో ఇన్వెస్ట్ చేసింది. ఇది అదానీ గ్రీన్‌కు మరో అనుబంధ సంస్థ. కాగా.. నిర్మాణం, అభివృద్ధి దశలో ఉన్న ప్రాజెక్టులు వాణిజ్య ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభిస్తే కొన్ని ప్రమాణాలకు లోబడి టోటల్‌ఎనర్జీస్ తిరిగి జేవీకి అదనపు పెట్టుబడులను సమకూర్చనుంది. ఇంతక్రితం ఏజీఈ23ఎల్‌లో టోటల్ రూ. 4,013 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. తప్పనిసరిగా మారి్పడికి లోనయ్యే డిబెంచర్ల ద్వారా నిధులు సమకూర్చింది.
టోటల్ పెట్టుబడుల నేపథ్యంలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ఎన్‌ఎస్‌ఈలో స్వల్ప నష్టంతో రూ. 1,597 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment