Total
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
సాక్షి, అమరావతి: భూముల సమగ్ర సర్వే ద్వారా భూమి రికార్డులను ఆధునీకరించి వాటిపై ప్రజలకు శాశ్వత భూ హక్కులు కల్పించేదే ల్యాండ్ టైట్లింగ్ చట్టం. దీనివల్ల రికార్డుల భద్రత, రిజిస్ట్రేషన్లలో పారదర్శకత, ఆస్తుల రక్షణకు ప్రభుత్వ గ్యారంటీ లభిస్తాయి.చట్టం ముఖ్య ఉద్దేశంప్రస్తుతం భూమి హక్కులు అంటే కనీసం 30 రికార్డులు చూసుకోవాలి. అన్ని వివరాలూ స్పష్టంగా ఉన్నా, 30 పత్రాలు బాగున్నా ఏదో ఒక విధంగా కేసులు పెట్టే పరిస్థితి ఉంది. దీంతో ఏ భూమినైనా వివాదాస్పదంగా మార్చొచ్చు. వివాదంలో ఉన్న భూమిని తిరిగి భూ యజమాని తన పేరు మీదకు తెచ్చుకోవాలంటే కోర్టుకే వెళ్లాలి. ఏళ్లకు ఏళ్లు వేచి చూడాలి. కింది కోర్టు, పైకోర్టు అంటూ తిరగాలి. ఈ అవస్థలన్నింటినీ తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకువచ్చింది. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందా?ల్యాండ్ టైట్లింగ్ చట్టం గెజిట్ జారీ అయినా ఇంకా అమల్లోకి రాలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఏదైనా అమలులో ఉన్నట్లు లెక్క. ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు. అసెంబ్లీలో బిల్లు పాసైంది. దీనికి టీడీపీ కూడా మద్దతు తెలిపింది. రీ సర్వే ఇంకా జరుగుతుండటంతో నోటిఫికేషన్ జారీ చేయలేదు. చట్టం అమల్లోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ అథారిటీ ఏర్పడుతుంది. ఆ అథారిటీ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అప్పిలేట్ అధికారులు, ట్రిబ్యునళ్లను నియమిస్తుంది. ఇంకా అథారిటీయే ఏర్పడలేదు. కాబట్టి టైటిల్ రిజిస్ట్రేషన్, అప్పిలేట్ అధికారులను నియమించలేదు. ఆ అధికారులుగా ఎవరు ఉండాలనే విషయాన్ని కూడా ఇంకా నిర్ణయించలేదు. అసలు చట్టమే ఉనికిలో లేదు. ఎందుకంటే దాని అమలుకు ఎటువంటి మార్గదర్శకాలు, నిబంధనలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. చట్టం అమలుకు నోటిఫికేషన్ జారీ చేసి అందుకనుగుణంగా నిబంధనలు, మార్గదర్శకాలతో జీవో జారీ అయితేనే అమల్లోకి వచ్చినట్లు లెక్క. అదేమీ లేకుండానే చట్టం అమలైపోయిందంటూ ప్రచారం చేస్తున్నారు.ఈ చట్టం వల్ల వచ్చే లాభంల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రకారం ఒకసారి మీ భూమి రికార్డుల్లోకి ఎక్కితే అదే తుది రికార్డు అవుతుంది. ఇతర రికార్డులు, కాగితాల కోసం తిరగాల్సిన అవసరం ఉండదు. ఎవరూ ఆ భూమిని లాక్కోలేరు. దౌర్జన్యం చేయలేరు. తప్పుడు పత్రాలు సృష్టించే అవకాశం ఉండదు. ఆ భూమి ఇతరుల పేర్ల మీదకు మారినా, మీకు తెలియకుండా మీ భూమి కోల్పోయినా, మీ ప్రమేయం లేకుండా రికార్డు మార్చినా ప్రభుత్వం నష్ట పరిహారం ఇస్తుంది. అంటే ప్రజల భూములకు ప్రభుత్వమే రక్షణ, భద్రత కల్పిస్తుంది.ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చరిత్రమన దేశంలో భూ రికార్డులు, లావాదేవీలు ఇప్పటివి కావు. 1526 నుంచి 1707 వరకు పాలించిన మొఘల్ చక్రవర్తుల కాలం నుంచి వస్తున్నాయి. ఆ తర్వాత బ్రిటిషర్లు కొన్ని నియమాలు పెట్టి భూ రికార్డులు తయారు చేశారు. వాటినే ఇప్పటికీ మనం ఉపయోగిస్తున్నాం. 75 సంవత్సరాలుగా దేశంలో భూ రికార్డుల ప్రక్షాళన జరగలేదు. వందల ఏళ్ల నాటి రికార్డులు కావడంతో ఇప్పటి పరిస్థితులకు సరిపోక భూ కబ్జాలు, తప్పుడు పత్రాలు సృష్టించడం, భూ వివాదాలు, సరిహద్దు సమస్యలు, సివిల్ కేసులు జనాన్ని పట్టి పీడిస్తున్నాయి.* 1986– తొలిసారిగా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే ఉద్దేశంతో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ఆలోచన చేసింది. దీనిపై అధ్యయనం కోసం ప్రొఫెసర్ డీసీ వాధ్వా ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్‌ను నియమించింది. సుదీర్ఘ అధ్యయనం చేశాక ఆయన 1989లో గ్యారెంటీయింగ్ టైటిల్ ఆఫ్ ల్యాండ్‌ను రూపొందించారు. కానీ అది అమలుకు నోచుకోలేదు.* 2008ల్యాండ్ టైట్లింగ్ చట్టం మళ్లీ తెర మీదకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రాం (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ)ను ప్రవేశపెట్టింది. కెనడా, యూకే వంటి యూరోపియన్ దేశాల్లో అమలు చేస్తున్న టోరెన్స్ విధానాన్ని అమలు చేయాలని భావించింది. రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయి. కానీ అమలు చేయలేదు.* 2010అప్పటి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ల్యాండ్ టైటిల్ యాక్ట్–2010ని రూపొందించింది. విధి విధానాలు ఖరారు చేసి డ్రాఫ్ట్‌ను ఆన్లైన్లో పెట్టింది. రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయాలని ఆదేశించింది. కానీ అమలు జరగలేదు.* 2013యూపీఏ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలు చేసే ఉద్దేశంతో నిపుణుల కమిటీ నియమించింది. ఈ కమిటీ టైట్లింగ్ చట్టానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది.* 2019ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదికను అమలు చేయాలని భావించింది. ఆ దిశగా ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రూపొందించింది. ఇందుకోసం నీతి ఆయోగ్ ముసాయిదా చట్టాన్ని రూపొందించి 2019 నవంబర్ 25న దాన్ని విడుదల చేసింది. ‘ది మహారాష్ట్ర టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్’ తరహాలో దీన్ని రూపొందించినట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో ఇదే చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచించి చట్టం గెజిట్ విడుదల చేసింది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్– ఇతను రిజిస్ట్రేషన్ల పత్రాలను పరిశీలించి సరిగా ఉన్నాయో లేదో చూస్తారు. తప్పుడు పత్రాలు ఉంటే వెంటనే తిరస్కరిస్తారు.– భూ యజమాని ఇచ్చిన సమాచారాన్ని బట్టి పబ్లిక్ నోటీసు ఇస్తారు. ఆ భూమిపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని ప్రజలను కోరతారు. ఇందుకు నిర్దిష్ట సమయం ఇస్తారు. – ఈ నోటీసుపై ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే వాటిని పరిశీలించి ఆ భూమి ఎవరిదో రికార్డుల ప్రకారం అక్కడే నిర్ధారిస్తారు. క్షేత్రస్థాయి పరిశీలన, చుట్టుపక్కల అభ్యంతరాలను స్వీకరిస్తారు.– ఆ భూమిపై ఎలాంటి వివాదాలూ లేకపోతే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే రిజిస్ట్రేషన్ నిలిపివేసి, పై అధికారులకు సమాచారం ఇస్తారు. అప్పిలేట్ అథారిటీ వద్దకు వెళ్లమని సూచిస్తారు.అప్పిలేట్ అథారిటీ– భూ లావాదేవీలు, సమస్యలను ఈ అథారిటీ పరిష్కరిస్తుంది. అప్పిలేట్ అధికారిగా జేసీ ఆ పైస్థాయి అధికారులు ఉంటారు. ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఉండదు.– టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సేవలు సంతృప్తిగా లేకపోయినా, అన్యాయం జరిగిందని భావించినా, తప్పుడు వివరాలు ఎక్కించారని తెలిసినా అప్పిలేట్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు.– ఈ అథారిటీ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులను పర్యవేక్షిస్తుంది. వారి విధులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రిజిస్ట్రేషన్లపై ఆరా తీస్తుంది. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తుంది.– టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి భూమి వివరాలను తప్పుగా ఎంట్రీ చేసినా, మీకు అన్యాయం జరిగినా అప్పిలేట్ అథారిటీకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఆ ల్యాండ్ రికార్డ్‌పై అనుమానం ఉంటే అథారిటీ ఆఫీసర్ సుమోటోగా ఫిర్యాదును స్వీకరించి విచారణకు ఆదేశిస్తారు.– భూమి రికార్డులను మార్చే అధికారం కేవలం అప్పిలేట్ అథారిటీ లేదా కోర్టుకు మాత్రమే ఉంటుంది. టైట్లింగ్ రిజిస్ట్రేషన్ అధికారి ప్రమేయం ఏమాత్రం ఉండదు.కోర్టు..– అప్పిలేట్ అథారిటీ వద్ద అన్యాయం జరిగిందని భావిస్తే హైకోర్టును ఆశ్రయించవచ్చు. హైకోర్టులో మీ కేసును వెంటనే పరిష్కరించడానికి ఒక బెంచ్‌ను ఏర్పాటు చేస్తారు.– అప్పిలేట్ అథారిటీపై వచ్చిన కేసులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు ఈ బెంచ్ పరిష్కరిస్తుంది. తద్వారా సత్వర న్యాయం అందుతుంది.– హైకోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్. దీన్ని అప్పిలేట్ అథారిటీ అమలు చేస్తుంది. ఈ తీర్పును మార్చే అధికారం అప్పిలేట్ అథారిటీ లేదా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు ఉండదు.ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రయోజనాలు– ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ వస్తుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమితోపాటు ఆ భూమి ఏ శాఖ పరిధిలోనిదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఈ రిజిస్టర్లో నమోదు చేస్తారు.– ఇప్పటివరకు వేర్వేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం ద్వారా పరిష్కారమవుతాయి. ఇప్పుడు జారీ చేసే రికార్డే ఫైనల్ రికార్డు. ఒకవేళ ఈ రికార్డులో మీకు అన్యాయం జరిగితే హైకోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక బెంచ్ ఉంటుంది.– మీ భూమికి ప్రభుత్వం గ్యారెంటీగా నిలవడం వల్ల భరోసా పెరుగుతుంది. పొరపాటున మీకు అన్యాయం జరిగితే ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లిస్తుంది. – ఈ చట్టం వల్ల భూ యజమానులకు భరోసా దక్కుతుంది. ఈ చట్టాన్ని తేవడానికి దేశంలోని చాలా రాష్ట్రాలు చాలా కాలంగా ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం సాధ్యం చేసి చూపించింది. అత్యంత సంక్లిష్టమైన భూ హక్కుల చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. ఈ చట్టం అమలైతే రాష్ట్రంలో భూవివాదాలు 90 శాతం మేర కనుమరుగవుతాయి.– ఒక భూమికి క్లియర్ టైటిల్ ఉంటే అమ్మకాలు, కొనుగోళ్లు పెరుగుతాయి. శాశ్వత భూ హక్కు చట్టం ద్వారా బ్యాంకుల్లో సులువుగా రుణాలు పొందవచ్చు. ఈ చట్టం వల్ల జీడీపీ కూడా పెరుగుతుందని శాస్త్రీయ లెక్కలు చెబుతున్నాయి.– మీ భూమిని మరొకరు దౌర్జన్యంగా లాక్కునే అవకాశం ఉండదు. తప్పుడు పత్రాలు సృష్టించే మార్గాలు మూసుకుపోతాయి. మీ భూమిపై మరొకరి ఆజమాయిషీ ఉండదు.– ల్యాండ్ టైట్లింగ్ చట్టం వల్ల మీ భూములకు శాశ్వత హక్కులు లభిస్తాయి. ఎలాంటి కబ్జాలకు ఆస్కారం ఉండదు. ఈ చట్టం వల్ల సరిహద్దు వివాదాలు, రికార్డుల తగాదాలు, గొడవలు తగ్గుతాయి. – ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్, అప్పిలేట్ ఆఫీసర్‌గా ప్రభుత్వ అధికారులనే నియమిస్తారు. ఇందులో బయటి వ్యక్తుల ప్రమేయం కానీ, ప్రలోభాలు కానీ ఉండవు. ఒకవేళ మీకు అన్యాయం జరిగినట్లు భావిస్తే నేరుగా హైకోర్టు బెంచ్‌ను ఆశ్రయించవచ్చు. అక్కడి తీర్పు ఆధారంగా మీ రికార్డులు మీరు పొందవచ్చు. నష్టపరిహారం కూడా తీసుకోవచ్చు.– భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరం అవుతుంది. మీ భూమి రికార్డుల్లోకి ఎక్కించేటప్పుడు మీ గ్రామంలోకి వచ్చి బహిరంగ ప్రకటన ఇస్తారు. మీ భూమి చుట్టుపక్కల రైతులతో మాట్లాడతారు. ఎలాంటి వివాదాలు లేకుంటేనే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకవేళ వివాదం ఉంటే డిస్ప్యూట్ రిజిస్టర్ కింద నమోదు చేసి, ఈ కేసును పరిష్కరిస్తారు.– ప్రస్తుతం ఉన్న భూ రికార్డుల వల్ల భూములకు భద్రత లేకుండా పోయింది. ఎప్పుడు ఎవరు కబ్జా చేస్తారనే భయం ప్రజల్లో ఉంది. ఎవరు ఎక్కడి నుంచి తప్పుడు పత్రాలు సృష్టిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ సమస్యకు చెక్ పెడుతుంది. -
అదానీ గ్రీన్‌కు టోటల్ ‘ఎనర్జీ’
న్యూఢిల్లీ: దేశీ ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీలో ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ఎనర్జీస్ 30 కోట్ల డాలర్లు(సుమారు రూ. 2,500 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. తద్వారా పునరుత్పాదక ఇంధన భాగస్వామ్య సంస్థ(జేవీ)లో సమాన వాటా తీసుకుంది. అదానీ రెనెవబుల్ ఎనర్జీ నైన్ లిమిటెడ్(ఏఆర్ఈ9ఎల్) పేరుతో జేవీని ఏర్పాటు చేశాయి. 1,050 మెగావాట్ల ప్రాజెక్ట్ పోర్ట్‌ఫోలియోగల జేవీలో అదానీ గ్రీన్, టోటల్ఎనర్జీస్ 50:50 శాతం చొప్పున వాటాను తీసుకున్నాయి. అదానీ గ్రీన్‌కు ఏఆర్ఈ9ఎల్ అనుబంధ సంస్థకాగా.. 300 మెగావాట్ల నిర్వహణా సామర్థ్యంతోపాటు, 500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మరో 250 మెగావాట్ల ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉన్నట్లు అదానీ గ్రీన్ వెల్లడించింది. అదానీ గ్రీన్‌లో 19.75 శాతం వాటా కలిగిన టోటల్ఎనర్జీస్ గతంలో అదానీ గ్రీన్ ఎనర్జీ ట్వంటీ త్రీ(ఏజీఈ23) లిమిటెడ్‌లో ఇన్వెస్ట్ చేసింది. ఇది అదానీ గ్రీన్‌కు మరో అనుబంధ సంస్థ. కాగా.. నిర్మాణం, అభివృద్ధి దశలో ఉన్న ప్రాజెక్టులు వాణిజ్య ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభిస్తే కొన్ని ప్రమాణాలకు లోబడి టోటల్ఎనర్జీస్ తిరిగి జేవీకి అదనపు పెట్టుబడులను సమకూర్చనుంది. ఇంతక్రితం ఏజీఈ23ఎల్లో టోటల్ రూ. 4,013 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. తప్పనిసరిగా మారి్పడికి లోనయ్యే డిబెంచర్ల ద్వారా నిధులు సమకూర్చింది. టోటల్ పెట్టుబడుల నేపథ్యంలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ఎన్ఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ. 1,597 వద్ద ముగిసింది. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,06,42,333
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,06,42,333కు చేరింది. అందులో 1,53,73,066 మంది పురుషులు, 1,52,51,797 మంది మహిళలు, 2,133 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక రెండో సవరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలను సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు/ కొత్తగా ఓటర్ల నమోదుకు దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 19 వరకు గడువు ఉందని తెలిపారు. సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులను పరిష్కరించి అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈ ఓటర్ల జాబితానే వినియోగించనున్నారు. ఇక రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలుండగా, ముసాయిదా జాబితాలో 3,06,26,996 మంది సాధారణ ఓటర్లతో పాటు మరో 2,742 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 15,337 మంది సరీ్వసు ఓటర్లున్నారు. 18–19 వయస్సు కలిగిన యువ ఓటర్ల సంఖ్య 4,76,597. కొత్త ఓటర్లు 8,31,520 మంది ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2023లో భాగంగా గత జనవరి 5న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో మొత్తం 2,99,77,659 మంది ఓటర్లు ఉండగా, ఓటర్ల జాబితా నిరంతర నవీకరణలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 8,31,520 మంది ఓటర్లను నమోదు చేశారు. 1,82,183 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఓటు తొలగిస్తే 15 రోజుల్లోగా అప్పీల్ చేయాలి ముసాయిదా జాబితాలో ఎవరిదైన పేరును తప్పుగా తొలగిస్తే బాధిత ఓటర్లు 15 రోజుల గడువులోగా జిల్లా ఎన్నికల అధికారికి అప్పీల్ చేసుకోవాలని సూచించారు. లేకుంటే మళ్లీ కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం–6 దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ‘ఓటర్ల’ అధికారుల బదిలీలపై నిషేధం సీఈఓ వికాస్‌రాజ్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల జాబితా రూ పకల్పనలో పాలుపంచుకుంటున్న అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఓటర్ల జాబితా సవరణలో కీలకమైన జిల్లా ఎన్నికల అధికారులు, ఉప జిల్లా ఎన్నికల అధికారులు, ఓటర్ల నమోదు అధికారులు, సహాయ ఓటర్ల నమోదు అధికారులు తదితర స్థాయి అధికారుల బదిలీలపై ఈ నెల 21 నుంచి అక్టోబర్ 4 వరకు నిషేధం అమల్లోకి ఉండనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ సోమవా రం ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ల జాబితా తయారీ బాధ్యతల్లోని అధికారులను బదిలీ చేస్తే జాబితా నాణ్యతపై ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ అత్యవసరంగా ఎవరైనా అధికారిని బదిలీ చేయాల్సివస్తే స్పష్టమైన వివరాలు అందజేసి ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి నుంచి బూత్ లెవల్ అధికారుల (బీఎల్ఓ) వరకు బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో ఈ నిబంధన లు వర్తిస్తాయన్నారు. దీర్ఘకాలిక సెలవు ల్లో వెళ్లడానికి ముందు ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందాలని అధికారులను సూచించారు. -
లాభాలు అదుర్స్! అదానీ కంపెనీల ఆదాయాలు వృద్ధి
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 4 రెట్లుపైగా ఎగసి రూ. 507 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 121 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం దాదాపు రెట్టింపై రూ. 2988 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 1,587 కోట్ల ఆదాయం ప్రకటించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 973 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 100 శాతం వృద్ధికాగా.. 2021–22లో రూ. 489 కోట్ల లాభం మాత్రమే నమోదైంది. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు మొత్తం ఆదాయం రూ. 5,548 కోట్ల నుంచి రూ. 8,633 కోట్లకు జంప్ చేసింది. ఇంధన విక్రయాలు 58 శాతం పుంజుకుని 14,880 మిలియ న్ యూనిట్లకు చేరాయి. సామర్థ్య విస్తరణ ఇందుకు సహకరించింది. గతేడాది 2,676 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జత చేసుకుంది. వినీత్ ఎస్.జైన్ 2023 మే 11 నుంచి ఎండీగా కొనసాగనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పటివరకూ సీఈవో, ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫలితాల నేపథ్యంలో అదానీ గ్రీన్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 3 శాతం బలపడి రూ. 977 వద్ద ముగిసింది. అదానీ గ్యాస్ లాభంలో వృద్ధి పట్టణాల్లో సీఎన్జీ, పైప్డ్ గ్యాస్ సేవలు అందించే అదానీ టోటల్ గ్యాస్, మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.98 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి వచ్చిన రూ.81 కోట్లతో పోలిస్తే 21 శాతం వృద్ధి చెందింది. విక్రయాల పరిమాణం 2 శాతం పెరిగి 193 మిలియన్ స్టాండర్డ్ క్యుబిక్ మీటర్లుగా ఉంది. కొత్తగా 126 సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో మొత్తం సీఎన్జీ స్టేషన్ల సంఖ్య 460కు చేరుకుంది. పైపుల ద్వారా గ్యాస్ అందించే కనెక్షన్ల సంఖ్య 1.24 లక్షలు పెరిగింది. దీంతో మొత్తం పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు 7.04 లక్షలకు చేరాయి. పారిశ్రామిక, వాణిజ్య కనెక్షన్లు 7,435కు పెరిగాయి. 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ రూ.4,683 కోట్ల ఆదాయంపై రూ.546 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. ఇదీ చదవండి: ఆన్లైన్ గేమింగ్‌పై పన్నులు.. ఖరారైతే మరిన్ని పెట్టుబడులు -
అదానీ గ్రీన్‌లో టోటల్‌కు వాటా
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌నకు చెందిన పునరుత్పాదక ఇంధన కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీలో వాటా కొనుగోలుకి ఫ్రాన్స్ దిగ్గజం టోటల్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా అదానీ గ్రీన్‌లో 20% వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకు దాదాపు రూ.18,200 కోట్లు (2.5 బిలియన్ డాలర్లు) వెచ్చించనుంది. ఒప్పందం ద్వారా సోలార్ ఎనర్జీ అభివృద్ధిలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా నిలుస్తున్న అదానీ గ్రీన్ బోర్డులో టోటల్‌కు సీటు లభించనుంది. అంతేకాకుండా 2.35 గిగావాట్స్ సోలార్ ఆస్తుల పోర్ట్‌ఫోలియోలోనూ 50 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు రెండు కంపెనీలూ సంయుక్తంగా వెల్లడించాయి. కంపెనీలో ప్రమోటర్లకు 74.92 శాతం వాటా ఉంది. దీనిలో 20 శాతం వాటాను టోటల్‌కు విక్రయించనున్నారు. ప్రస్తుతం ప్రమోటర్లకు చెందిన 16.4 శాతం వాటాకు సమానమైన 25.65 కోట్ల షేర్లను టోటల్ కొనుగోలు చేసినట్లు అదానీ గ్రీన్ తాజాగా వెల్లడించింది. ఇందుకు రూ. 14,600 కోట్లు(2 బిలియన్ డాలర్లు) చెల్లించినట్లు తెలియజేసింది. తదుపరి మరో 50 కోట్ల డాలర్ల(రూ. 3,600 కోట్లు)తో మిగిలిన వాటాను సైతం సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇతర కంపెనీలలో..: చమురు, ఇంధన రంగ ఫ్రాన్స్ దిగ్గజం టోటల్ 2018లో గౌతమ్ అదానీ గ్రూప్‌లోని ఇతర కంపెనీలలోనూ వాటాల కొనుగోలుకి ఒప్పందాలు కుదుర్చుకుంది. తద్వారా అదానీ గ్యాస్‌లో 37.4 శాతం వాటా, ఒడిషాలో నిర్మాణంలో ఉన్న ధమ్రా ఎల్ఎన్జీ ప్రాజెక్ట్‌లో 50 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు అంగీకరించింది. కాగా.. అదానీ ఎనర్జీలో 20 శాతం వాటా కొనుగోలు ద్వారా అదానీ గ్రూప్‌తో భాగస్వామ్యాలను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు టోటల్ పేర్కొంది. తద్వారా దేశీయంగా శుద్ధ ఇంధన రంగంలో రెండు కంపెనీలూ మార్పులకు కృషి చేయనున్నట్లు తెలియజేసింది. చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ విద్యుత్, పునరుత్పాదక ఇంధనాలవైపు మళ్లనున్నట్లు వివరించింది. 2025కల్లా స్థూలంగా 35 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేసింది. కంపెనీ ప్రస్తుత పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 7 గిగావాట్లుగా ఉంది. ఈ ఏడాదిలో 10 గిగావాట్స్‌కు చేరాలని భావిస్తోంది. ఇక మరోపక్క ఇదే సమయంలో అదానీ గ్రీన్ 25 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని చేరుకోవాలని ఆశిస్తోంది. ప్రస్తుతం సంస్థ కాంట్రాక్టెడ్ సామర్థ్యం 14.6 గిగావాట్లుగా నమోదైంది. 3 గిగావాట్ల నిర్వహణలో ఉండగా.. మరో 3 జీడబ్ల్యూ నిర్మాణంలో ఉంది. అంతేకాకుండా 8.6 జీడబ్ల్యూ అభివృద్ధి దశలో ఉంది. 2015లో ఆరంభం... అదానీ గ్రీన్ తమిళనాడులో 648 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులతో 2015లో ప్రారంభమైంది. ఇది అంతర్జాతీయంగా ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ప్రాజెక్ట్‌కాగా.. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ విద్యుదుత్పాదక ఆస్తులు కలిగిన సంస్థగా ఆవిర్భవించింది. అదానీ గ్రీన్‌లో ప్రవేశించడం తమ వ్యూహాలలో మైలురాయివంటిదని టోటల్ సీఈవో, చైర్మన్ ప్యాట్రిక్ పయానే పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధనం, సహజవాయు విభాగాలలో విస్తరించేందుకు భారత మార్కెట్ కీలకమన్నారు. చౌక పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తికి వ్యూహాలను పంచుకోనున్నట్లు అదానీ చైర్మన్ గౌతమ్ అదానీ చెప్పారు. 2030కల్లా 450 గిగావాట్ల పునరు త్పాదక ఇంధనాన్ని సాధించేందుకు ఇరు కంపెనీలూ కలసి పనిచేస్తాయని వివరించారు. -
విద్యార్థి సంపూర్ణ వికాసమే కీలకం
గణితంపై భయాన్ని తొలగించాలి పదోతరగతిలో మెరుగైన ప్రమాణాలు సాధించాలి మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవాలి ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశంలో కలెక్టర్ లోకేష్‌కుమార్ ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంపూర్ణ వికాసాభివృద్ధే కీలకంగా ప్రధానోపాధ్యాయులు ముందుకెళ్లాలని కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ కోరారు. పదో తరగతి ఫలితాలు, పాఠశాలల్లో మౌలిక వసతులు తదితరాంశాలపై జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నగరంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిని జెడ్పీ చైర్పర్సన్ కవిత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో తప్పనిసరిగా టాయిలెట్స్ ఉండాలన్నారు. అసంపూర్తిగా ఉన్నవాటిని పూర్తిచేయాలన్నారు. మరో 870 పాఠశాలల్లో టాయిలెట్స్‌ను ఎన్‌ఆర్‌ఐఈజీఎస్ ద్వారా నిర్మించుకోవాలన్నారు. పాఠశాల పరిశుభ్రత కోసం విద్యాకమిటీ చైర్మన్‌తో సమన్వయం చేసుకుని వర్కర్లను నియమించుకోవాలని సూచించారు. పాఠశాలలన్నీ పచ్చగా ఉండేలా చెట్లు పెంచాలని, పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రతి పాఠశాలకు తాగునీరు, రన్నింగ్‌వాటర్ కోసం మిషన్ భగీరథ పథకంలో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలను వెంటనే కూల్చివేసేందుకు జిల్లాపరిషత్ నుంచి త్వరలో అనుమతుల వస్తాయన్నారు. జిల్లాలో జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ‘‘ప్రభుత్వ పాఠశాలలంటే.. వాటిలో ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులే చదువుతారనే పేరుంది. దీనిని తొలగించేందుకు ప్రధానోపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరముంది’’ అని అన్నారు. గత సంవత్సరం పదోతరగతి పరీక్షల్లో అత్యధికమంది విద్యార్థులు గణితంలోనే ఫెయిలవుతుండడంపై విచారం వ్యక్తం చేశారు. దీనిని అధిగమించేందుకు, గణితంపై భయం తొలగేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. మాతృభాష తెలుగులో కూడా కొందరు ఫెయిలువుతుండడం బాధాకరమన్నారు. పదోతరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకుగాను కనీసంగా 10 నుంచి 20 మోడల్ ప్రశ్నాపత్రాలతో ప్రాక్టీస్ చేయించాలని సూచించారు. జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత మాట్లాడుతూ... సిలబస్ పూర్తిపై కాకుండా, బోధించిన అంశం విద్యార్థులకు ఏమేరకు అర్థమవుతోందన్న దానిపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. గణతం ప్రాథమికాంశాలను నేర్పించకపోతే పై తరగతులకు వెళ్లినప్పుడు ఇబ్బంది పడతారని అన్నారు. డీఈఓ నాంపల్లి రాజేష్, డిప్యూటీ డీఈఓలు బస్వారావు, వెంకటనర్సమ్మ, రాములు కూడా మాట్లాడారు. పదోతరగతిలో నూటికి నూరుశాతం ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాయులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఆర్వీఎం పీఓ రవికుమార్, డీడీ అబ్రహం, డీసీఈబీ చైర్మన్ కనపర్తి వెంకటేశ్వర్లు, ఆర్పీహెచ్ఎం జిల్లా అధికారి నిర్మల్‌కుమార్, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
ఆఫ్రికా ఆయిల్ రిటైల్ బిజినెస్‌కు రిలయన్స్ గుడ్‌బై
♦ గ్యాప్కోలో 76% వాటా విక్రయం.. ♦ కొనుగోలు చేసిన ఫ్రాన్స్ దిగ్గజం.. టోటల్ న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఆఫ్రికాలోని పెట్రో ఉత్పత్తుల రిటైల్ వ్యాపారానికి గుడ్‌బై చెప్పింది. గల్ఫ్ ఆఫ్రికా పెట్రోలియం కార్పొరేషన్(గ్యాప్కో)లో తనకున్న 76 శాతం పూర్తి వాటాను ఫ్రాన్స్ దిగ్గజం టోటల్‌కు విక్రయించినట్లు ఆర్ఐఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. ఒప్పందం ప్రకారం గ్యాప్కోకు కెన్యా, ఉగాండా, టాంజేనియాల్లో ఉన్న కార్యకలాపాలు, ఆస్తులు మొత్తం టోటల్‌కు దక్కుతాయి. గ్యాప్కోలో ఆర్ఐఎల్ విదేశీ అనుబంధ సంస్థ రిలయన్స్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ డీఎంసీసీకి ఈ 76 శాతం వాటా ఉండగా, మిగిలిన 24 శాతం వాటా మారిషస్‌కు చెందిన ఫార్చూన్ ఆయిల్ కార్పొరేషన్‌కు ఉంది. ఫార్చూన్ ఆయిల్ నుంచి కూడా టోటల్ 24 శాతం వాటాను కొనుగోలు చేస్తోంది. ఈ నెల 30న తమ అనుబంధ సంస్థ టోటల్‌తో ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఆర్ఐఎల్ ఓ ప్రకటన తెలిపింది. 2007 సెప్టెంబర్‌లో ఆర్ఐఎల్ తన అనుబంధ సంస్థ ద్వారా గ్యాప్కోలో 76 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఆ తర్వాత క్రమంగా తూర్పు ఆఫ్రికాలోని దిగ్గజ పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీల్లో ఒకటిగా గ్యాప్కో ఎదిగింది. ప్రస్తుతం దీనికి 2,60,000 కిలోలీటర్ల నిల్వ సామర్థ్యంతో పాటు 108 బంకుల నెట్వర్క్ ఉంది. ఆఫ్రికా పెట్రో రిటైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న టోటల్.. తాజా డీల్‌తో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోనుంది. గ్యాప్కోలో పూర్తి 100 శాతం వాటా కొనుగోలు నేపథ్యంలో రిటైల్ సర్వీస్ స్టేషన్ల(బంకులు) నెట్‌వర్క్‌తో పాటు కెన్యాలోని మొంబాసా, టాంజేనియాలోని దారుస్సలామ్ లాజిస్టిక్ టర్మినల్స్ కూడా టోటల్‌కు లభించనున్నాయి. కాగా, వివిధ నియంత్రణ సంస్థల నుంచి అనుమతులకు లోబడి ఈ ఒప్పందం కొద్ది నెలల్లోనే పూర్తవుతుందని ఆర్ఐఎల్ పేర్కొంది.