
అగ్రిటెక్ స్టార్టప్ ‘నర్చర్‌డాట్‌ఫార్మ్’ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తన ప్లాట్‌ఫామ్ పరిధిలోని 23 లక్షల మంది రైతులకు బీమా ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది. ‘‘పంటల సాగు కాలంలో రైతులు ఎన్నో రిస్క్‌లు ఎదుర్కొంటుంటారు. వాతావరణంలో అనూహ్య మార్పులు పంటల దిగుబడిపై ప్రభావం చూపిస్తాయి.
రైతుల సహజ పనితీరు దృష్ట్యా వారి ఆరోగ్యానికి రిస్క్ ఉంటుంది. పంట ఉత్పత్తుల ధరలు కూడా అస్థిరతలకు గురవుతుంటాయి. ఫలితంగా రైతులు నష్టపోవాల్సి వస్తుంది. అయినా కానీ, ఖరీదైన ప్రీమియంను చూసి ఎక్కువ మంది రైతులు బీమాను ఎంపిక చేసుకోరు. వారికి మా ప్లాట్‌ఫామ్ ద్వారా బీమా పరిష్కారాలను అందించనున్నాం’’అని నూర్చర్ తెలిపింది.
చదవండి: Airtel 5g: ఎయిర్‌టెల్ యూజర్లకు భారీ షాక్! ఈ ఫోన్‌లలో 5జీ పనిచేయడం లేదంట!
Comments
Please login to add a commentAdd a comment