ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్‌ఏఐ భాగస్వామ్యాన్ని, దానికి సంబంధించిన ఇటీవల పరిణామాల్ని యూకే నియంత్రణ సంస్థ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ దిగ్గజ కంపెనీల కలయిక యూకేలోని కంపెనీ మధ్య పోటీపై ఎలాంటి ప్రభావం చూపనుందన్న అంశాన్ని గమనిస్తోంది.
ఓపెన్‌ఏఐతో మైక్రోసాఫ్ట్ అనుబంధం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మార్కెట్‌ను ప్రభావితం చేయగలదా అని యూకేకి చెందిన కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (CMA) పరిశీలిస్తోంది. ఈమేరకు అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. అభిప్రాయ సేకరణ (ITC) అనేది సమాచార సేకరణ ప్రక్రియలో మొదటి భాగమని, అధికారికంగా మొదటిదశ విచారణకు ముందు చేపట్టే ప్రక్రియ అని సీఎంఏ ఒక ప్రకటనలో తెలిపింది.
ఓపెన్‌ఏఐలో ఇటీవల అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇందులో మైక్రోసాఫ్ట్ ప్రవేశించింది. ఈ పరిణామాల దృష్ట్యా మైక్రోసాఫ్ట్, ఓపెన్‌ఏఐ భాగస్వామ్యం, ఇటీవల పరిణామాలు కంపెనీల పోటీపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది తెలుసుకునేందుకు అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది.
ఓపెన్‌ఏఐలో నాటకీయ పరిణామాలు
గత నెలలో ఓపెన్‌ఏఐ బోర్డు నాటకీయ చర్యలో సీఈవో సామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించింది. తరువాత, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తమ అధునాతన ఏఐ పరిశోధనకు నాయకత్వం వహించాలని ఆయను ఆహ్వానించారు. అయితే ఓపెన్‌ఏఐ పూర్తిగా కొత్త బోర్డ్‌తో ఆల్ట్‌మన్‌ను సీఈవోగా పునరుద్ధరించడంతో ఈ నాటకీయ పరిణామానికి ముగింపు పడింది.
‘ఏఐ డెవలపర్‌ల మధ్య నిరంతర పోటీ అవసరం. ఇది ఈ రంగంలో నూతన ఆవిష్కరణలు, వృద్ధి, బాధ్యతాయుతమైన అభ్యాసాలను అందించడంలో సహాయపడుతుంది’ సీఎంఏ అభిప్రాయపడింది. మైక్రోసాఫ్ట్-ఓపెన్‌ఏఐ భాగస్వామ్యం ఈ రంగంలో కంపెనీల మధ్య పోటీని దెబ్బతీసే ప్రమాదం ఉందా అని సీఎంఏ సమీక్షిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment