న్యూఢిల్లీ: దేశీయంగా కంపెనీలపై సైబర్ దాడులు మరింత పెరిగాయి. జనవరి–మార్చి త్రైమాసికంలో ప్రతీ వారం సగటున ఒక్కో కంపెనీపై 2,108 దాడులు జరిగినట్టు చెక్ పాయింట్ నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 18 శాతం పెరిగినట్టు పేర్కొంది.
సైబర్ నేరస్థులు తమ దాడుల కోసం చాట్ జీపీటీ వంటి టూల్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారని, కోడ్ జనరేషన్‌కు వినియోగిస్తున్నారని తెలిపింది.
అంతర్జాతీయంగా చూస్తే మార్చి త్రైమాసికంలో కంపెనీలపై సైబర్ దాడులు 7 శాతం పెరిగాయి. ఒక్కో వారం సగటున ఒక్కో సంస్థ 1,248 దాడులను ఎదుర్కొన్నది. అంతర్జాతీయంగా విద్య, పరిశోధన రంగాల్లోని కంపెనీలపై ఎక్కువ సైబర్ దాడులు నమోదయ్యాయి. ఒక్కో వారం సగుటన ఒక్కోసంస్థపై 2,507 దాడులు జరిగినట్టు, 15 శాతం పెరిగినట్టు చెక్ పాయింట్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment