Netflix Partners With Microsoft: పిండి కొద్ది రొట్టే అనే సామెత వినే ఉంటారు. కానీ కొన్ని సార్లు ఈ సామెత కూడా మారాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ పరిస్థితి కూడా అలానే ఉంది మరి. ఎందుకంటే ఓటీటీలో కంటెంట్ పరంగా నెట్‌ఫ్లిక్స్‌లో కొదవ లేదు, అంతేనా క్వాలిటీ మూవీస్, వెబ్ సిరీస్ విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు ఉంటాయి. అయితే సబ్‌స్క్రిప్షన్ రేట్లు కూడా ఎక్కువగా ఉండటంతో అంత ఖర్చు ఎందుకులే అనుకున్న యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌ని పక్కన పెడుతున్నారు. దీంతో తక్కవ ధరకే కస్టమర్లకి సబ్‌స్క్రిప్షన్ అందించాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించుకుంది.
తాజాగా ఆ దిశగా మరో అడుగు వేస్తూ తక్కవ ధర సబ్‌స్క్రిప్షన్‌లో యాడ్స్ జతచేయనుంది. అందుకోసం నెట్‌ఫ్లిక్స్ మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపింది. ఈ సంస్థను తన గ్లోబల్ అడ్వర్‌టైజింగ్, సేల్స్ పార్ట్‌నర్‌గా ప్రకటించింది. ఈ ఏడాది చివరికల్లా ఈ ప్లాన్ తీసుకొచ్చే అవకాశం ఉంది.
2 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు..
ఈ ఏడాది తొలి క్వార్టర్‌లోనే నెట్‌ఫ్లిక్స్ 2 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. దీంతో ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి నెట్‌ఫ్లిక్స్ ఈ యాడ్స్‌తో కూడిన సబ్‌స్క్రిప్షన్ ఆలోచన చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్‌ల గరిష్ఠ ప్లాన్ ఏడాదికి రూ.1500 ఉండగా, నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం ఇదే ఏడాది ప్లాన్ రూ.7700 వరకూ ఉంది. ఇంకేముంది ఎంత కంటెంట్ ఉన్నా పైసలు కూడా దృష్టిలో ఉంచుకున్న కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్‌ని పక్కన పెట్టడంతో ఈ ప్లాన్ తీసుకొచ్చేందకు సన్నాహాలు చేస్తోంది.
చదవండి: Provident Fund Tax Rules: ఈపీఎఫ్ చందాదారులకు షాక్.. కొత్త రూల్స్ ఇవే!
Comments
Please login to add a commentAdd a comment