
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలిసారి బ్యాటింగ్‌లో ఒక రికార్డు నమోదైంది. గత మూడు టెస్టుల్లో బౌలింగ్‌లోనే రికార్డులు వచ్చాయి తప్పిస్తే బ్యాటింగ్‌లో పెద్ద సంచలనాలు నమోదు కాలేదు. తాజాగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తొలిసారి బ్యాటర్లు పరుగులు పండగ చేసుకుంటున్నారు.
తొలిరోజు పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించిన ఆస్ట్రేలియా జట్టు రెండో రోజు ఆటలోనే అదే స్థిరత్వాన్ని కొనసాగిస్తుంది. ఓవర్‌నైట్ స్కోరు 255/4తో రెండోరోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ ప్రస్తుతం నాలుగు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఖవాజా 129, గ్రీన్ 65 పరుగులతో ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 126 పరుగులు అజేయంగా జోడించారు. ఈ సిరీస్‌లో ఈ భాగస్వామ్యమే ఇప్పటివరకు అత్యధికంగా ఉంది.
ఇంతకముందు ఢిల్లీ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా బ్యాటర్లు అశ్విన్, అక్షర్‌లు కలిసి ఎనిమిదో వికెట్‌కు 114 పరుగులు జోడించడం బెస్ట్‌గా ఉంది. తాజాగా ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ గ్రీన్‌లు దానిని బ్రేక్ చేశారు. పరిస్థితి చూస్తుంటే ఈ ఇద్దరు కలిసి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పినా ఆశ్చర్యపోనవసరం లేదు.
చదవండి: పాట్ కమిన్స్ తల్లి కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment