హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఆడియో బుక్స్ విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం ఆడియో స్ట్రీమింగ్ వేదిక పాకెట్ ఎఫ్‌ఎంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తన కస్టమర్లకు ఎక్స్‌క్లూజివ్, లైసెన్స్‌డ్ ఆడియో బుక్స్‌ను పాకెట్ ఎఫ్ఎం ద్వారా అందుబాటులోకి తీసుకురానుంది.
ఫ్లిప్‌కార్ట్ ఎఫ్ఎంసీజీ బిజినెస్ హెడ్ కంచన్ మిశ్రా మాట్లాడుతూ.. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆడియో బుక్స్ బాగా ప్రాచుర్యం పొందాయని, పాకెట్ ఎఫ్ఎంతో కలిసి రచయితలకు సహకారం అందించడం ద్వారా ఆడియోబుక్స్ తేనున్నామని తెలిపారు.దేశంలో ఇప్పటికే సుమారు 2.5 కోట్ల మంది ఆడియో బుక్స్‌ను వింటున్నట్టు అంచనా. పాకెట్ ఎఫ్‌ఎం ప్రతి నెల 1,20,000కిపైగా ఆడియో బుక్స్‌ను విక్రయిస్తోంది.
చదవండి: ITR Filing Deadline: మేమేమైనా మెషిన్లమా? మొత్తుకుంటున్న నెటిజన్లు
Comments
Please login to add a commentAdd a comment