గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం విస్తరిస్తున్నట్లు దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ప్రకటించింది. జనరేటివ్ ఏఐ, మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్లాట్ ఫామ్ అజూర్‌ల్లో గ్లోబల్ కస్టమర్ల దత్తత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
క్లౌడ్, ఏఐ వర్క్ లోడ్స్‌లో మైక్రోసాఫ్ట్ ఎంటర్‌ప్రైజెస్ కస్టమర్‌లకు వ్యూహాత్మ సరఫరాదారుగా మద్దతునిస్తామని ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఖర్చు తగ్గించడంతోపాటు చురుకుదనం, స్కేలబిలిటీని సాధించడంలో సహాయపడటానికి మైక్రోసాఫ్ట్ జనరేటివ్ ఏఐతో ఐపీ సొల్యూషన్‌ల పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది.
ఇన్ఫోసిస్ టోపాజ్, ఇన్పోసిస్ కోబాల్ట్, ఇన్ఫోసిస్ ఆస్టర్ వంటి సొల్యూసన్స్ తో మైక్రోసాఫ్ట్ జనరేటివ్ ఏఐ ఆఫరింగ్స్ సమ్మిళితం చేస్తున్నారు. ఫైనాన్స్, హెల్త్ కేర్, సప్లయ్ చైన్, టెలీ కమ్యూనికేషన్స్ తదితర కీలక రంగాల కస్టమర్ల ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment