
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ సేవల్లోని ఐనాక్స్ లీజర్‌తో విలీనానికి తమ వాటాదారులు ఆమోదం తెలిపినట్టు పీవీఆర్ ప్రకటించింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పీవీఆర్ మంగళవారం తన వాటాదారుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి ఆమోదాన్ని కోరింది.
99 శాతం విలీనానికి అనుకూలంగా ఓటు వేసినట్టు పీవీఆర్ బుధవారం ప్రకటించింది. విలీనానికి ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ అనుమతులను పీవీఆర్–ఐనాక్స్ లీజర్ జూన్‌లోనే పొందాయి. ఈ ఏడాది మార్చి 27న ఈ సంస్థలు తమ విలీన ఒప్పందాన్ని ప్రకటించాయి. తద్వారా 1,500 స్క్రీన్లతో దేశంలోనే అతిపెద్ద ఆపరేటర్‌గా అవతరించనున్నట్టు తెలిపాయి.