18 కంపెనీల పేర్లు సీబీడీటీ బహిర్గతం
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) 18 పన్ను ఎగవేత కంపెనీల పేర్ల జాబితాను విడుదల చేసింది. ఈ కంపెనీలు చెల్లించాల్సిన మొత్తం రూ. 500 కోట్లు. ఇలా పన్ను ఎగవేత కంపెనీల పేర్లను ప్రకటించడం ఇదే తొలిసారి. పన్ను వసూళ్ల పెంపుపై దృష్టి పెట్టిన కేంద్రం ఈ దిశలో చేసిన ప్రయత్నమే ఇదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సీబీడీటీ వెబ్‌సైట్‌లో ఈ జాబితాను పోస్ట్ చేశారు. 18 కంపెనీల్లో 11 గుజరాత్‌కు చెందినవి కావడం విశేషం. వీటిలో పలు కేసుల్లో అసెస్సీల (పన్ను చెల్లించాల్సిన వారు) జాడ కూడా తెలియడం లేదని వివరించారు.
కంపెనీలు ఇవీ...: సోమానీ సిమెంట్ (రూ.27.47 కోట్లు), బ్లూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (రూ.75.11 కోట్లు), ఆపిల్‌టెక్ సొల్యూషన్స్ (రూ.27.07కోట్లు), జూపిటర్ బిజినెస్ (రూ.21.31 కోట్లు), హిరక్ బయోటెక్ (రూ.18.54 కోట్లు), ఐకాన్ బయోఫార్మా అండ్ హెల్త్‌కేర్ (రూ.17.69 కోట్లు), బన్‌యాన్ అండ్ బెర్రీ అలయ్స్ (రూ.17.48 కోట్లు), లక్ష్మీనారాయన్ టీ థాకర్ (రూ.12.49 కోట్లు), విరాగ్ డయ్యింగ్ అండ్ ప్రింటింగ్ (రూ.18.57 కోట్లు), పూనమ్ ఇండస్ట్రీస్ (రూ.15.84 కోట్లు), కున్వర్ అజయ్ ఫుడ్ (రూ.15 కోట్లు), గోల్డ్‌సుక్ ట్రేడ్ ఇండియా (రూ.75.47 కోట్లు), విక్టర్ క్రెడిట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (రూ.13.81 కోట్లు), నోబెల్ మర్చండైస్ (రూ.11.93 కోట్లు) జాబితాలో ఉన్న కొన్ని కంపెనీలు. రూ.38.31 కోట్ల బకాయిల విషయమై పుణేకు చెందిన జీకే ధరణి పేరూ జాబితాలో ఉంది.
పన్ను ఎగవేతదారులపై కొరడా
Published Fri, Mar 27 2015 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM
Advertisement
Advertisement