ప్రకాశం జడ్పీ ఛైర్మన్పై అనర్హత వేటు | prakasham zp chairman haribabu disqualified | Sakshi
Sakshi News home page

ప్రకాశం జడ్పీ ఛైర్మన్పై అనర్హత వేటు

Published Mon, Aug 11 2014 3:08 PM | Last Updated on Thu, Sep 27 2018 8:42 PM

ప్రకాశం జడ్పీ ఛైర్మన్పై అనర్హత వేటు - Sakshi

ప్రకాశం జడ్పీ ఛైర్మన్పై అనర్హత వేటు

ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఈదర హరిబాబు జడ్పీటీసీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అక్కడి జిల్లా కలెక్టర్ విజయకుమార్ నిర్ణయం తీసుకున్నారు. విప్ ధిక్కరించిన కేసులో ఆయనపై అనర్హత వేటు వేశారు. దాంతో ఆయన జడ్పీటీసీ సభ్యత్వంతో పాటు.. ఛైర్మన్ పదవి కూడా పోయినట్లు అవుతుంది. గతనెల 13వ తేదీన జరిగిన జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి వైఎస్ఆర్ సీపీ వ్యూహాత్మకంగా ఇచ్చిన మద్దతుతో చైర్మన్ గా ఈదర హరిబాబు గెలిచిన విషయం తెలిసిందే.

అయితే, ఆ సమయంలో అసలు తెలుగుదేశం పార్టీ తనకు విప్ ఇవ్వనే లేదని, అలాంటప్పుడు దాన్ని ధిక్కరించే ప్రశ్న ఎక్కడినుంచి వస్తుందని హరిబాబు అంటున్నారు. ఇంతకుముందే ప్రిసైడింగ్ అధికారి తనకు షోకాజ్ నోటీసు ఇవ్వగా దానికి ఆయన సమాధానం కూడా ఇచ్చారు. అయినా కూడా ఇప్పుడు ఆయన సభ్యత్వం రద్దు కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement