హైదరాబాద్ : తెలంగాణ బిల్లును అసెంబ్లీలో గట్టెక్కించేందుకు పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అవకాశం లేకపోలేదని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఈ సమావేశంలోనే తెలంగాణ బిల్లుకు అందరు డిమాండ్ చేస్తున్నారని, వీలు కాకపోతే ప్రత్యేక సమావేశాలు పెట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్పై జీవోఎం పెట్టిన సూచనలపై ఉన్న అభ్యంతరాలపై గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు, నాయకులతో సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ భేటీ కానున్నట్లు దానం తెలిపారు.