
అనుచరుల పచ్చం!
స్వయం ఉపాధితో జీవితాన్ని చక్కబెట్టుకోవాలనుకున్న నిరుద్యోగుల ఆశలపై టీడీపీ నేతలు నీళ్లు చల్లారు. పార్టీ వర్గీయులు, అనుచరులకే పెద్దపీట వేయడం.. అధికారులను పక్కనపెట్టి స్వయంగా నాయకులే రుణమేళా నిర్వహించడంతో అర్హులకు నిరాశ మిగిలింది. గుత్తి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ, కాపు సబ్సిడీ రుణాలకు సంబంధించి 470 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే ఇంటర్వ్యూ ప్రారంభమైన పది నిముషాలకే టీడీపీ నేతలు బ్యాంకు, మండల పరిషత్ అధికారుల స్థానంలో కూర్చొని పెత్తనం చెలాయించారు. ఆ పార్టీ కార్యకర్తల దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ముగించేశారు.
- గుత్తి: