న్యూఢిల్లీ : జామా మసీదు షాహీ ఇమాం సయ్యద అహ్మద్ బుఖారీకి ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తన కుమారుడిని డిప్యూటీగా ప్రకటిస్తూ చేసిన ప్రకటనకు చట్టబద్ధత లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. మరోవైపు జామా మసీదు డిప్యూటీ షాహీ ఇమాంగా బుఖారీ కుమారుడు షాబాన్ బుఖారీ ప్రమాణస్వీకారోత్సవంపై హైకోర్టు శుక్రవారం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులు జనవరి 28లోగా నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
కాగా ఇమాం పదవిని 400 సవత్సరాలుగా బుఖారీ కుటుంబమే నిర్వహిస్తోంది. ఆనువంశికంగా దీనిని చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో బుఖారీ తనయుడు షాబాన్ బుఖారీ...డిప్యూటీగా ఈనెల 22న ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందు కోసం ఇమాం బుఖారీ దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగా వెయ్యిమంది మత పెద్దలను ఆహ్వానించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, మన హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరులను ఆహ్వానించారు. అయితే తన కుమారుడిని నయీబ్ షాహీ ఇమాం (ఉప ఇమాం)గా ప్రకటించే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించలేదు.
ఇమాం బుఖారీకి ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ
Published Fri, Nov 21 2014 11:46 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM
Advertisement
Advertisement