
సాక్షి, అమరావతి: సామాజిక న్యాయ సాధనలో స్వర్ణయుగాన్ని తీసుకువస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగన్ మరోసారి సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సామాజిక న్యాయం పాటించింది. రెండో డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎంపికలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అగ్రస్థానం వేసింది. 85 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రెండో డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికల్లో 56 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారు. బీసీలు 24 మందికి, ఎస్సీలు 22 మందికి, ఓసీలు 37, ఎస్టీలు ఇద్దరికి అవకాశం ఇచ్చారు. అన్ని వర్గాలు, కులాలకు వైఎస్ జగన్ ప్రాధాన్యం ఇచ్చారు.
కాగా, మేయర్,మున్సిపల్ చైర్‌పర్సన్ల పదవుల్లోనూ సామాజిక న్యాయానికి, మహిళా సాధికారతకు వైఎస్సార్‌సీపీ పెద్దపీట వేసి సరికొత్త చరిత్రను లిఖించిన సంగతి తెలిసిందే. చర్రితలో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాలకు 78 శాతం పదవులు లభించాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో కూడా బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు అగ్రాసనం వేశారు. మహిళలకు సమున్నత స్థానం కల్పించారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏకంగా 58 శాతం నామినేటెడ్ పదవులు ఇచ్చారు. మహిళలకు ఏకంగా 50.40 శాతం పదవులు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment