Photo Credit: AndrewEnns
ప్రపంచంలోని అతి విచిత్రమైన జలాశయాల్లో ఇదొకటి. నీటిపైన ఏదో డిజైన్ ఏర్పడినట్లు కనిపిస్తోంది కదూ! ఇందులోని ఖనిజాల వల్ల ఈ సరస్సు ఇలా మచ్చలు మచ్చలుగా కనిపిస్తుంది. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఓసోయూస్ పట్టణానికి చేరువలో ఉందిది.
నీటిపై నిండా మచ్చలతో కనిపిస్తూ ఉండటం వల్ల దీనికి ‘స్పాటెడ్ లేక్’ (మచ్చల సరస్సు) అనే పేరు వచ్చింది. ఈ సరస్సులో మెగ్నీషియం సల్ఫేట్, సోడియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్ ఖనిజాలు అధిక సాంద్రతతో నిండి ఉన్నట్లు శాస్త్రవేత్తల పరీక్షల్లో తేలింది.
అలాగే ఈ సరస్సు నీటిలో వెండి, టిటానియం లోహాలు కూడా స్వల్ప పరిమాణంలో ఉన్నట్లు తేలింది. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో ఈ సరస్సులోని ఖనిజాలను ఆయుధాల తయారీకి వాడేవారు. ఇదివరకు ఈ సరస్సు నీటితో వివిధ వ్యాధులకు సంప్రదాయ వైద్యం చేసేవారు కూడా. ఈ వింత సరస్సును చూడటానికి పర్యాటకులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు.
చదవండి: Horned Orb Spider: ఈ కొమ్ముల సాలీడు చాలా సాధుజీవి తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వృక్షం.. 125 ఏళ్లుగా
Comments
Please login to add a commentAdd a comment