
ఒట్టావా: కెనడాలో ఖలిస్థానీ వేర్పాటు వాదులు హిందూ దేవాలయాలపై దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖలిస్థానీ వేర్పాటు వాదులకు మద్దతు పలుకుతూ హిందూ దేవాలయాలపై దాడికి పాల్పడ్డ వారిపై కెనడా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని కొందరు ఖలిస్థానీలు భక్తులపై దాడులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనను కెనడా ప్రధాని జెస్టిన్ ట్రూడో తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ఖలిస్థానీలకు మద్దతు పలుకుతున్న ప్రభుత్వ అధికారులపై కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఖలిస్థాని జెండాతో కెనడా పీల్ ప్రాంత రీజనల్ పోలీసు అధికారి హరీందర్ సోహీపై ఆందోళన చేపట్టారు. ఖలిస్థానికి మద్దతుగా, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హరీందర్ సోహీ నినాదాలు చేస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో కెనడా పోలీస్ శాఖ సోహీపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది.
కెనడా కమ్యూనిటీ సేఫ్టీ, పోలీసింగ్ యాక్ట్ నిబంధనల్ని ఉల్లంఘించినందనే హరీందర్ సోహీపై చర్యలు తీసుకున్నట్లు రిచర్డ్ చిన్ తెలిపారు. మరోవైపు హిందూ దేవాలయాలపై ఖలిస్థానీ వేర్పాటు వాదుల దాడిని సీరియస్‌గా తీసుకున్న కెనడా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.
ఖండించిన మోదీ
కెనడాలోని హిందూ ఆలయం లక్ష్యంగా జరిగిన దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ విధ్వంసక ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద ప్రయత్నాలు కూడా అంతే దారుణమైనవి పేర్కొన్నారు. ఇలాంటి హింసాత్మక చర్యలు భారత్ స్థైర్యాన్ని ఏమాత్రం బలహీనపరచలేవన్నారు. ఈ ఘటనపై కెనడా ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment