gangavaram
-
మిమ్మల్ని ఎలా నమ్మాలి పవన్ కల్యాణ్ ?
గాజువాక/సీతంపేట/సాగర్‌నగర్/ పీఎంపాలెం: ‘ఇదే వేదికపై మీ మాటలు నమ్మి తెలుగుదేశానికి ఓట్లు వేశాం. ఇక్కడ పల్లా శ్రీనివాసరావును గెలిపించాం. ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఇప్పుడుమిమ్మల్ని ఎలా నమ్మాలి?’విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం గంగవరం మత్స్యకార గ్రామంలో పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై గ్రామస్తుడు కొర్లయ్య సంధించిన ప్రశ్న ఇది. దీనిపై స్పందించిన పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ టీడీపీకి, బీజేపీ వారు సమస్యలను పరిష్కరించకపోవడం వల్లే ఇప్పుడు ఆ పార్టీలను నిలదీయడానికి వచ్చానన్నారు. గంగవరం కాలుష్యం సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. గంగవరం గ్రామంలోని నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ గంగవరం పోర్టు కాలుష్యం వల్ల గ్రామంలో అందరి ఆరోగ్యాలు పాడవుతున్నాయన్నారు. కాలుష్య సమస్య పరిష్కారమయ్యేవరకు తాను అండగా ఉంటానని చెప్పారు. మీకు న్యాయం చేసే పార్టీలకే 2019లో ఓట్లు వేయాల’ని కోరారు. నాయకులు శేషు, ముసలయ్య, రాఘవరావు పాల్గొన్నారు. బుద్ధుడి పూజలు చేసిన పవన్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస చేసిన అంబేడ్కర్ భవన్ ఆవరణలో ఉన్న బుద్ధ ప్రార్థనా మందిరాన్ని శుక్రవారం సందర్శించారు. అలాగే సాగర్‌నగర్‌లో పవన్‌ను మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, వట్టి వసంతకుమార్ కలిశారు. పలు అంశాలపై చర్చించారు.బçస్సు యాత్రకు బయలు దేరిన పవన్‌కల్యాణ్ పీఎంపాలెం పోలీస్‌స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి బస చేశారు. -
బావిలో పడ్డ ఎలుగుబంటి
బెళుగుప్ప (ఉరవకొండ) : బెళుగుప్ప మండలం గంగవరంలో ఓ ఎలుగుబంటి ప్రాణభయంతో పరుగెడుతూ బావిలో పడిపోయింది. అటవీ అధికారులు నిచ్చెన సాయంతో దాన్ని బయటకు తీశారు. వివరాలిలా ఉన్నాయి. ఓ ఎలుగుబంటి ఆహారం కోసం సోమవారం తెల్లవారుజామున గంగవరం గ్రామంలోకి చొరబడింది. దీన్ని గమనించిన కుక్కలు దానిపై దాడికి యత్నించాయి బెదిరిపోయిన ఎలుగుబంటి æఅకస్మాత్తుగా ఒక ఇంట్లోకి దూరి మాధవి అనే మహిళ వీపుపై గాయపరిచింది. గ్రామంలో కలకలం రేగడంతో జనం పోగయ్యారు. దాన్ని తరిమివేసేందుకు ప్రయత్నం చేశారు. బెంబేలెత్తిపోయిన ఎలుగుబంటి వారి నుంచి తప్పించుకునేందుకు పరుగు తీస్తూ గ్రామ శివారులోని నీరులేని పాడుబడిన బావిలోకి పడిపోయింది. లోతు ఎక్కువగా ఉండటంతో బయటకు రాలేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు,అటవీ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. బావిలోకి నిచ్చెన వేయగా..దాని సాయంతో ఎలుగుబంటి పైకి వచ్చి అటవీప్రాంతంలోకి పరుగులు తీసింది. -
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
బెళుగుప్ప (ఉరవకొండ) : బెళుగుప్ప మండలం గంగవరంలో మంగళవారం రాత్రి జరిగిన అల్లర్లలో కులం పేరుతో దూషిస్తూ ఎర్రిస్వామి అనే వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో గ్రామానికి చెందిన చంద్ర, శీన, పవన్, అన్వర్, వెంకటేశులు అనే వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బుధవారం నమోదు చేసినట్లు ఎస్ఐ నాగస్వామి తెలిపారు. నిందితుల దాడిలో ఎర్రిస్వామి గాయపడి అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. గంగవరంలో ఉద్రిక్తం రాతి దూలం పోటీల్లో గెలిచిన ఎద్దులను ఊరేగించే క్రమంలో గంగవరంలో మంగళవారం రాత్రి అల్లర్లు చెలరేగాయి. అందులో ఎర్రిస్వామి అనే వ్యక్తిని గ్రామానికి చెందిన ఐదుగురు చితకబాదారు. దీంతో గ్రామంలో రాత్రంతా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎప్పుడేం జరుగుతుందోనని గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే సీఐ శివప్రసాద్ నేతృత్వంలో ఎస్ఐ నాగస్వామి, ఏఎస్ఐ విజయనాయక్, మరికొందరు పోలీసులు బుధవారం ఉదయమే గ్రామంలో పర్యటించారు. శాంతిభద్రతలను పర్యవేక్షించారు. గ్రామంలో అల్లర్లకు పాల్పడినా, దాడులకు దిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ: ఇద్దరి మృతి
గంగవరం: చిత్తూరు జిల్లా గంగవరం మండలం కల్లుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మదనపల్లి నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్, బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యక్తికి రిమాండ్
బెళుగుప్ప (ఉరవకొండ) : మండల పరిధిలోని గంగవరం గ్రామానికి చెందిన విద్యార్థినిపై ఈనెల 4న లైంగికదాడి చేసిన ఘటనలో హరి అనే వ్యక్తిని కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించామని ఎస్ఐ నాగస్వామి శుక్రవారం పేర్కొన్నారు. నిందితుడ్ని కళ్యాణదుర్గం కోర్టుకు హాజరుపరుచగా 14 రోజులు రిమాండ్‌ను కోర్టు విధించిందన్నారు. -
ఖతర్నాక్ చోరీ!
ఐవోసీ పైపునకు కన్నం వేసి డీజిల్, పెట్రోలు అపహరణ పొలం లీజుకు తీసుకుని అక్కడ నుంచి రవాణా ఆలస్యంగా గుర్తించిన అధికారులు తరలిపోయిన ఇంధనం విలువ రూ. కోట్లలో.. గంగవరం(చిత్తూరు జిల్లా) : చెన్నై నుండి బెంగళూరుకు వెళుతున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) పైపులైనుకు కన్నం వేసి డీజల్, పెట్రోలు అపహరించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని పొన్నమాకులపల్లెలో ఈ వ్యవహారం బయటపడింది. రెండు నెలలుగా ఐవోసీ అధికారులు మండల పరిధిలో ఎక్కడో గ్యాస్ లీక్ అవుతోందని భావించి గాలించారు. ఎక్కడా బయట పడక పోవడంతో జాతీయ రహదారి పక్కనే పొన్నమాకులపల్లెకు చెందిన క్రిష్ణప్ప అనే రైతు పొలంలో వెళుతున్న పైపులైన్‌ను శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. దీంతో అసలు విషయం బయట పడింది. పైపుకు కన్నం వేసి దాన్నుంచి పైపు వేసి సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న పట్టుపురుగుల షెడ్డులో ఆయిల్ బేరళ్ళు అమర్చి వాటిని నింపేవారు. అక్కడి నుండి లారీల ద్వారా బయటికి తరలిస్తున్నారని గుర్తించి విస్మయం చెందారు. మూడు నెలల క్రితం బెంగళూరుకు చెందిన వ్యక్తులు పొలం లీజుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటామని క్రిష్ణప్ప వద్ద ఒప్పందం చేసుకొన్నట్లు సమాచారం. బెంగళూరుకు చెందిన వ్యక్తుల వివరాలు తెలియలేదు. శుక్రవారం పొలం యజమాని వద్ద ఐవోసీ అధికారులు అనుమతి తీసుకొని పైపులైనును పరిశీలించారు. విషయం తెలుసుకున్న పొలం లీజుకు తీసుకొన్న వ్యక్తి, పొలం యజమాని మెల్లగా జారుకున్నారు. ఐవోసీ అధికరులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలం చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేయడానికి చర్యలు తీసుకొంటున్నారు. బెంగళూరుకు చెందిన వ్యక్తులు మూడు నెలల క్రితం పొలాన్ని వ్యవసాయం కోసం లీజుకు తీసుకొన్నారు. అప్పటి నుండి ఈతతంగం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. రూ. కోట్ల మేర అక్రమ వ్యాపారం జరిగి ఉండవచ్చని అంచనాలు వేస్తున్నట్లు సమాచారం. ఇక్కడి నుండి ట్యాంకర్ల ద్వారా అక్రమ రవాణా జరిగిందని అధికారులు అంటున్నారు. ఐవోసీ పైపులైనుకు కన్నం వేసే సమయంలో ప్రమాదం జరిగి ఉంటే సుమారు 15కి.మీ మేర పైపులైను, ఆస్తి నష్టం జరిగి ఉండేది. గంటకు 250 కి.మీ. స్పీడుతో ఇందనం తరలివెళ్తుందనీ ఐవోసీ అధికారులు తెలిపారు. ఐఓసీ (చెన్నై) సీనియర్ మేనేజరు సత్యనారాయణ దీనిపై స్పందిస్తూ డీజల్, పెట్రోలు చోరీ జరిగింది వాస్తమేనన్నారు. ఎంత మేరకు చోరీ జరిగిందనే విషయం తెలుసు కోవడానికి సమయం పడుతుందన్నారు. -
కౌలు రైతు ఆత్మహత్య
గంగవరం (చిత్తూరు) : అప్పుల బాధతో చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో శనివారం ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంగవరం మండలం ఎల్లంపల్లెకు చెందిన రామప్ప(45) కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పంటల కోసం రూ.4 లక్షల మేర అప్పులు చేశాడు. అతని భార్య రేణుక కూడా డ్వాక్రా రుణాలు తీసుకుంది. డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయన్న ఆశతో రేణుక బ్యాంకుకు డబ్బు జమ చేయకుండా ఆపేసింది. అయితే డబ్బులు కట్టాలంటూ డ్వాక్రా గ్రూపు సభ్యులు ఇటీవల రేణుక భర్త రామప్పను నిలదీశారు. శుక్రవారం రేణుకతో ఘర్షణకు కూడా దిగారు. ఈ క్రమంలో శనివారం ఉదయం రేణుక తన భర్తతో గొడవకు దిగింది. అనంతరం ఆమె పొలం వద్దకు వెళ్లింది. ఈలోపు రామప్ప ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెవెన్యూ, పోలీసు అధికారులు వివరాలు సేకరించి, మృతదేహాన్ని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
బైక్ దొంగల ముఠా అరెస్ట్
గంగవరం: చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు శనివారం గంగవరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీసులు నిందితులను ప్రవేశపెట్టారు. తమిళనాడుకు చెందిన సత్యమూర్తి, సుబ్రమణ్యం, రాజేంద్రన్, అబ్దుల్ ఫరూక్‌లు గత కొంతకాలంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. అలా దొంగలించిన బైక్‌లను మధ్యవర్తులుగా ఉన్న రామసముద్రం మండలానికి చెందిన శ్రీనివాసులు, రమణ, మునుస్వామిలకు విక్రయిస్తున్నారు. వీరు ముగ్గురు తక్కువ ధరలకు ఆ బైక్‌లను కొని వేరే వ్యక్తులకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి 53 బైక్‌లు 143కిలోల 20 ట్రాన్స్ఫార్మర్స్కు చెందిన అల్యూమినియం తీగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 25 లక్షల వరకు ఉండవచ్చిని పోలీసులు అంచనా వేశారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నట్టు పోలీసులు తెలిపారు. -
బాధిత కుటుంబాలకు బాసటగా..
గంగవరం : రంపచోడవరం మండలం ఐ.పోలవరం వద్ద ఈ నెల 4న పెళ్లి వ్యాను బోల్తా పడ్డ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఓదార్చి, వారిలో మనోధైర్యం నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జూలై మొదటి వారంలో రానున్నారని ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ చెప్పారు. జగన్ పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఆయన ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, రాష్ట్ర కార్యదర్శి కర్రిపాపారాయుడు తదితరులతో కలసి మండలంలోని సూరంపాలెం, కొత్తాడలలో పర్యటించారు. జగన్ పర్యటన రూట్‌ను పరిశీలించారు. జగన్ పర్యటన విజయవంతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా జ్యోతుల సూరంపాలెంలో విలేకరులతో మాట్లాడుతూ పెళ్లివ్యాను బోల్తా ఘటనలో సూరంపాలెంకు చెందిన 8 మంది, కొత్తాడకు చెందిన ఒకరు మృతి చెందడం, అనేకులు గాయపడడం విచారకరమన్నారు. దుర్ఘటనపై విచారం వ్యక్తం చేసిన జగన్ ఈ నెల 10నే బాధితుల పరామర్శకు రావలసి ఉండగా అదే రోజు ప్రధానిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లడంతో రాలేకపోయారన్నారు. వచ్చే నెల మొదటి వారంలో రానున్న ఆయన సూరంపాలెంలో మృతుల కుటుం బాలను, క్షతగాత్రులను పరామర్శించాక కాకినాడలో మత్య్సకార కుటుంబాలను కూడా పరామర్శిస్తారన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు కల్లం సూర్యప్రభాకర్, డాక్టర్ చిన్నస్వామి, జనపరెడ్డి సుబ్బారావు(బాబు), యెజ్జు వెంకటేశ్వరరావు, అత్తిలి సీతారామస్వామి, బలుమూరి సత్యనారాయణ, శెట్టిబత్తుల రాజబాబు, ఏడుకొండలు, తోట రాజేశ్వరరావు, నారాయణరావు, శారపు కామరాజుదొర, బాబి, గోడి వీర్రాజు, తిరుపతిరావు, శ్రీను, అప్పలకొండ తదితరులు ఉన్నారు. -
భర్తను హత్య చేసిన భార్య
కె.గంగవరం; మద్యం సేవించి అరాచకం చేస్తున్న భర్త వేధింపులను తట్టుకోలేక భార్య కిరాతకంగా చంపిన సంఘటన సంచలనం రేకెత్తించింది. మద్యం తాగి వేధింపులకు గురిచేస్తున్న భర్తను గెడ్డపారతో తలపై గట్టిగా కొట్టడంతో మృతి చెందిన సంఘటన కె. గంగవరంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం, వైఎస్సార్ కాలనీకి చెందిన అనుసూరి శ్రీను(35)కి అదే గ్రామానికి చెందిన దుర్గతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 11 ఏళ్ల లలితాదేవి, 8 ఏళ్ల కల్యాణి అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ వ్యవసాయ కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మొదట్లో కాపురం సజావుగా సాగినా భర్త శ్రీను మద్యం, పేకాటకు బానిసగా మారి దుర్గను తరచూ వేధించేవాడు. రెండేళ్ల క్రితం భర్తపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు శ్రీనుపై కేసు కూడా నమోదు చేశారు. ఇరు కుటుంబాల పెద్దలు సజావుగా కాపురం చేసుకోవాలని హితవు చెప్పడంతో దుర్గ తిరిగి భర్తతో కలసి కాపురం చేసుకుంటోంది. ఇటీవల భర్త శ్రీను తరచూ మద్యం సేవించి కొట్టేవాడు. శుక్రవారం ఉదయం మద్యం సేవించి దుర్గను శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. భర్త చేష్టలకు విసిగిపోయిన భార్య గడ్డపారతో భర్త ముఖంపై పలుసార్లు మోదింది. గమనించిన స్థానికులు ఆమె చేతిలో గడ్డపారను లాక్కున్నారు. సహనం కోల్పోయిన దుర్గ ఇంట్లో ఉన్న మరో గడ్డపారతో భర్త శ్రీను తల వెనుక బలంగా కొట్టింది. తీవ్ర గాయాలైన శ్రీనును స్థానికులు ఆటోలో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. శ్రీను పరిస్థితి విషమించటంతో ఏరియా ఆసుపత్రి అంబులెన్స్‌లో కాకినాడ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. శ్రీనివాస్ తల్లి భద్రం ఫిర్యాదు మేరకు రామచంద్రపుం సీఐ కాశీవిశ్వనాధ్, ఎస్సై వి.పెద్దిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామచంద్రపురం డీఎస్పీ రవీంద్రనాధ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. -
గంగవరం పెట్రోనెట్ ఎల్ఎన్జీ టెర్మినల్‌లో...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం వద్ద నిర్మించతలపెట్టిన ద్రవీకృత సహజవాయువు(ఎల్ఎన్జీ) టెర్మినల్‌లో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ దిగ్గజం హెచ్‌పీసీఎల్ వాటా తీసుకోనుంది. పెట్రోనెట్ ఎల్ఎన్జీ రూ. 5,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయప్రతిపాదించిన ఈ టెర్మినల్‌లో హెచ్‌పీసీఎల్ 8% వాటాను కొనుగోలు చేసే అవకాశముంది. విశాఖపట్టణంలో గల రిఫైనరీకి భారీ స్థాయిలో గ్యాస్ అవసరముండటంతో గంగవరం టెర్మినల్ లో వాటాపట్ల హెచ్‌పీసీఎల్ ఆసక్తి చూపుతున్నట్లు పెట్రోనెట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతమున్న 8.33 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని 15 మిలియన్ టన్నులకు హెచ్‌పీసీఎల్ విస్తరిస్తోంది. ఫలితంగా రోజుకి 3 మిలియన్ల ప్రామాణిక ఘనపు మీటర్లవరకూ గ్యాస్ అవసరపడనుంది. 69% వాటా పెట్రోనెట్‌కు ప్రాజెక్ట్‌లో వ్యూహాత్మక ఇన్వెస్టర్లకు 24% వాటాను ఆఫర్ చేయనునట్లు పెట్రోనెట్ అధికారి తెలిపారు. దీనిలో భాగంగా గంగవరం పోర్ట్ ఇప్పటికే 8% వాటాను తీసుకోగా, ఎల్ఎన్జీ సరఫరాదారులకు మరో 8% వాటాను పక్కనపెట్టినట్లు వెల్లడించారు. ఇక హెచ్‌పీసీఎల్‌కు 8% వాటా కొనుగోలుకి మాత్రమే అవకాశముందని వివరించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం 5% వాటా తీసుకునేందుకు ఆసక్తి ప్రదర్శించిందని, దీంతో పెట్రోనెట్‌కు 69% వాటా మిగులుతుందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఐవోసీ, ఓఎన్జీసీ, గెయిల్, బీపీసీఎల్ గతంలో కన్సార్షియంగా ఏర్పడి పెట్రోనెట్ ఎల్ఎన్జీలో విడిగా 12.5% చొప్పున వాటా పొందిన సంగతి తెలిసిందే. ఈ టెర్మినల్‌లో హెచ్‌పీసీఎల్‌కు వాటా లభించలేదు. కాగా, గంగవరంలో ఏర్పాటు చేయనున్న టెర్మినల్ నుంచి గెయిల్ 2.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ కొనుగోలుకి ఆసక్తిని వ్యక్తం చేసింది. ఇది ప్రతిపాదిత ఎల్ఎన్జీ టెర్మినల్ సామర్థ్యంలో సగభాగం కావడం గమనార్హం. ఈ అంశంలో గెయిల్‌తో చర్చలు జరుగుతున్నాయని ఇప్పటికింకా ఏ విషయమూ ఖరారు కాలేదని పెట్రోనెట్ అధికారి చెప్పారు. గంగవరం ప్రాజెక్ట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గత నెలలో అన్ని అనుమతులూ లభించాయి. దీంతో 2018కల్లా టెర్మినల్‌ను పూర్తిచేయాలని పెట్రోనెట్ భావిస్తోంది. -
గిరిజన హక్కుల సాధనకు ఉద్యమించాలి
గంగవరం :గిరిజనులకు రాజ్యాధికారం, హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఆదివాసీ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక సినిమాహాల్ ఆవరణలో శనివారం జరిగిన ఆదివాసీ జిల్లా సదస్సుకు సంఘ నాయకుడు డాక్టర్ కుంజం సత్యనారాయణదొర అధ్యక్షత వహించారు. ఆదివాసీ సాంస్కృతిక ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కంగల శ్రీనివాసుదొర మాట్లాడుతూ నకిలీ కులధ్రువ పత్రాలతో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో అసలైన ఆదివాసీలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు అందరూ కలసి పోరాడాలన్నారు. ఆదివాసీ సమస్యలను పరిష్కరించుకొనేందుకు హక్కుల సాధనకు యువతరం ఉప్పెనలా ముందుకు రావాలని సభాధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణదొర అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరిసిక ప్రకాష్, రిటైర్డు ఏపీపీ బంగార్రాజు, ఆదివాసీ సాంసృతిక ఉద్యోగ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడబాల రాంబాబు తదితరులు ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను వివరించారు. అధికారులు చట్టాలను సక్రమంగా అమలు చేసి గిరిజనుల హక్కులను కాపాడాలన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సభలో చర్చించారు. అనంతరం గంగవరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సదస్సులో ఎంపీపీ తీగల ప్రభ, మాజీ ఎంపీపీలు ఎం.బాపిరాజు, మడకం ఝాన్సీలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు కోసు బుల్లియమ్మ, సర్పంచ్ కలుముల అక్కమ్మ, ఉపసర్పంచ్ పరదా రాంబాబు, గిరిజన దీపిక డెరైక్టర్ కుంజం వెంకటేశ్వర్లుదొర, గిరిజన వర్ధిక సంస్థ డెరైక్టర్ కుంజం చిన్నారావు, జిల్లా ఎరుకుల సంఘం నాయకుడు దసరి గంగరాజు, ఏజెన్సీ ఏడు మండలాలకు చెందిన ఆదివాసీ ఉద్యోగులు, యువకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
మరో 5 విమానాశ్రయాలు..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వాడుకలో ఉన్న 8 విమానాశ్రయాలకు తోడు మరో ఐదు చోట్ల కొత్త విమానాశ్రయాలను నిర్మించాల్సిన అవసరముందని శివరామకృష్ణన్ కమిటీ పేర్కొంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దాలని సూచించింది. పుట్టపర్తి, కడప, రాజమండ్రి విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం కుప్పం, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలలో విమానాశ్రయాల ఏర్పాటు అవసరాన్ని ప్రస్తావించిన విషయాన్ని నివేదికలో పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికే నిర్మించిన, కొత్తగా నిర్మించే పోర్టుల నుంచి దేశంలో అన్ని ప్రాంతాలకు రోడ్డు, రైల్వే మార్గాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని కమిటీ సూచించింది. విశాఖపట్నం మేజర్ పోర్టు, కాకినాడ, కృష్ణపట్నం, గంగవరం, రవ్వ పోర్టులతో పాటు.. నిర్మాణంలో ఉన్న మచిలీపట్నం, మేఘవరం, నక్కపల్లి, కాకినాడ ఎస్ఈజెడ్ పోర్టులను అభివృద్ధి చేసుకోవడానికి.. అలాగే ప్రతిపాదనల్లో ఉన్న కళింగపట్నం, భావనపాడు, దుగ్గరాయపట్నం, రామయపట్నం, భీమునిపట్నం, నర్సాపురం వంటి ప్రాంతాల్లో పోర్టుల నిర్మాణానికి అవకాశాలు ఉన్నాయని చెప్పింది. గోల్డెన్ క్వార్డీలేటరల్ ప్రధాన రహదారితో పాటు ఉత్తర - దక్షిణ కారిడార్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రహదారి మార్గం అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని.. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో పెరిగే అవసరాల దృష్ట్యా అన్ని ప్రధాన రహదారులను విస్తరించాల్సిన అవసరముందని పేర్కొంది. -
ఆత్మపరిశీలన చేసుకోవాలి
గంగవరం : అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఆత్మపరిశీలన చేసుకోవాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి హితవు పలికారు. శనివారం సాయంత్రం గంగవరంలో మండల కన్సీనర్ కల్లం సూర్యప్రభాకర్ అధ్యక్షతన జరిగిన వైఎస్సార్ సీపీ మండల కార్యకర్తల సమావేశంలో ఆమెతో పాటు పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్(బాబు) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాజేశ్వరి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్‌లో మహిళలకు గౌరవం లేదని, విలువే లేదని ఎంపీ గీత వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని, ఇందుకు అరకు పార్లమెంటరీ పరిధిలో ఎక్కువ శాతం మహిళా అభ్యర్థులకే సీట్లు ఇవ్వడం నిదర్శనమన్నారు. ఆయన ఆశీస్సులతో టిక్కెట్ దక్కించుకుని, పార్టీ కార్యకర్తలు, నాయకుల శ్రమతో ఎంపీగా గెలుపొందిన గీత.. పార్టీకి వెన్నుపోటు పొడి చి, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రంపచోడవరం నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, నాయకులపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులపై శాసన సభలో ప్రస్తావిస్తానన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటా : అనంతబాబు తనపై, కార్యకర్తలపై అధికార పార్టీ, పార్టీలోని అంతర్గత శత్రువులు ఎన్ని కుట్రలు, వెన్నుపోటు రాజకీయాలు చేసినా.. వైఎస్సార్‌కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలుస్తామని అనంత ఉదయభాస్కర్ అన్నారు. అధికార పార్టీ వేధింపులు, కవ్వింపు చర్యలకు భయపడొద్దని, సమర్ధవంతంగా ఎదుర్కొందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రంపచోడవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ బలమైన శక్తిగా ఉందని, దానిని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. పార్టీ మరింత బలోపేతం కావడానికి కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు ఎంపీ గీతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమావేశంలో నెల్లిపూడి ఎంపీటీసీ సభ్యురాలు ఆదిలక్ష్మి, సర్పంచ్ అక్కమ్మ, డీసీసీబీ డెరైక్టర్ యెజ్జు వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు కొటికలపూడి రామతులసీ, డాక్టర్ సీహెచ్ చిన్నస్వామి, వైఎస్ ప్రసాద్, సూరంపూడి ఏడుకొండలు, దిండి మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
జీతాలెలా ఇస్తావో చెప్పు బాబూ!
కె.గంగవరం, న్యూస్‌లైన్ :రాష్ట్రంలో కుటుంబానికి ఓ ఉద్యోగం ఇస్తానని బూటకపు ప్రకటనలు చేస్తున్న చంద్రబాబు.. వారికి జీతాలెలా ఇస్తారో చెప్పాలని మాజీ మంత్రి, రామచంద్రపురం వైఎ స్సార్ సీపీ అభ్యర్థి పిల్లి సుభాష్‌చంద్ర బోస్ డిమాండ్ చేశారు. కోలంక నుంచి కె.గంగవరం మండలం యండగండి వరకు సాగిన పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’లో మంగళవారం ఆయన పాల్గొన్నారు. కె.గంగవరం సభలో బోస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 3.70 కోట్ల ఇళ్లు ఉన్నాయన్న సంగతి బాబుకు తెలియదన్నారు. సాధ్యం కాని ప్రకటనలను నమ్మేందుకు ప్రజలు అమాయకులు కారన్నా రు. రాష్ట్ర బడ్జెట్లో 15 శాతం సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తానని జగన్మోహన్రెడ్డి ప్రకటించారని, అలా చంద్రబాబు స్పష్టం చేయగలరా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ మేని ఫెస్టోలో ప్రకటించిన పథకాలన్నీ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన మరుక్షణం అమల్లోకి వస్తాయన్నారు. ఇంటికో ఉద్యోగం, రైతుల రుణాల మాఫీని చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ఎందుకు చేయలేదని నిలదీశారు. వైఎస్ కుటుంబంపై కుట్రలు : విశ్వరూప్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్ర చేపడితే, కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వైఎస్ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేశాయని మాజీ మంత్రి, అమలాపురం పార్లమెంటరీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ అన్నారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు చీకటిపాలనను ప్రజలు మరలా కోరుకోవడం లేదన్నారు. మండపేట అసెంబ్లీ అభ్యర్థి గిరిజాల వెంకటస్వామినాయుడు, సీఈసీ సభ్యుడు రెడ్డి ప్రసాద్, నాయకులు కర్రి పాపారాయుడు, డాక్టర్ యనమదల మురళీకృష్ణ, యనమదల గీత, వి.సూర్యచంద్ర రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.