మనం సరదాగా అడువులు దగ్గరగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ జనసంచారం లేని సమయంలో వచ్చే జంతువులను చూస్తే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అలానే అవి చేసే పనులు చాలా ఫన్నీగా అనిపిస్తాయి. అదీకాక కొన్ని క్రూర మృగాలను చూస్తే చాలా భయంగా అనిపిస్తుంది.
(చదవండి: అబ్బా ఏం ఆడుతుంది...ఇది కదా ఆటంటే)
కానీ కొన్ని జంతువుల చేసే పనులు వాటి చేష్టలు మనల్ని భలే ఆకట్టుకుంటాయి. అచ్చం అలానే ఇక్కడొక ఎలుగుబంటి భలే అందంగా డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. నిజానికి అది డ్యాన్స్ చేయడం లేదు ఆ ఎలుగుబంటికి తన వీపు దురద పుట్టి అలా ఒక పోల్‌కి జారబడి తన వీపుని గోక్కుంటుంది.
కానీ మనకు మొదట చూడగానే అబ్బా భలే డ్యాన్స్ చేస్తుందనిపిస్తుంది. అది కూడా " ప్రవేశం లేదు’ అనే బోర్డు ఉన్న పోల్‌కి జారబడి అలాచేయడం చాలా హాస్యస్పదంగా ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇది జంగిల్ బుక్‌లో ఉండే జంతువుల్లా ఉంది అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు.
(చదవండి: ఆమె గుండె చప్పుడు వినిపించడమే కాదు.. కనిపిస్తోంది కూడా!)
Comments
Please login to add a commentAdd a comment