scratching
-
‘ప్రవేశం లేదు’ బోర్డు.. ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి!
మనం సరదాగా అడువులు దగ్గరగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ జనసంచారం లేని సమయంలో వచ్చే జంతువులను చూస్తే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అలానే అవి చేసే పనులు చాలా ఫన్నీగా అనిపిస్తాయి. అదీకాక కొన్ని క్రూర మృగాలను చూస్తే చాలా భయంగా అనిపిస్తుంది. (చదవండి: అబ్బా ఏం ఆడుతుంది...ఇది కదా ఆటంటే) కానీ కొన్ని జంతువుల చేసే పనులు వాటి చేష్టలు మనల్ని భలే ఆకట్టుకుంటాయి. అచ్చం అలానే ఇక్కడొక ఎలుగుబంటి భలే అందంగా డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. నిజానికి అది డ్యాన్స్ చేయడం లేదు ఆ ఎలుగుబంటికి తన వీపు దురద పుట్టి అలా ఒక పోల్కి జారబడి తన వీపుని గోక్కుంటుంది. కానీ మనకు మొదట చూడగానే అబ్బా భలే డ్యాన్స్ చేస్తుందనిపిస్తుంది. అది కూడా " ప్రవేశం లేదు’ అనే బోర్డు ఉన్న పోల్కి జారబడి అలాచేయడం చాలా హాస్యస్పదంగా ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇది జంగిల్ బుక్లో ఉండే జంతువుల్లా ఉంది అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఆమె గుండె చప్పుడు వినిపించడమే కాదు.. కనిపిస్తోంది కూడా!) View this post on Instagram A post shared by EARTH FOCUS (@earthfocus) -
మెదడు అతి స్పందనతోనే దురద.. గోకుడు!
దురద పుట్టినప్పుడు అక్కడ గోక్కుంటే ఎంతో హాయిగా ఉంటుంది కదూ. కానీ ఆ తర్వాతే కాసేపటికల్లా మంట పుడుతుంది. కానీ.. అలా గోక్కోవాలి అనిపించడానికి.. మెదడు అతిగా స్పందించడమే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గోక్కుంటున్నప్పుడు మొదట్లో బాగానే ఉంటుంది గానీ, మరీ ఎక్కువగా గోకితే మాత్రం అక్కడ దురద ఇంకా పెరుగుతుందని, అలాగే నొప్పితో పాటు చర్మం మీద కూడా మచ్చలు పడతాయని ఈ అంశం మీద పరిశోధన చసిన హిడెకి మొచిజుకి అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ చెప్పారు. ఆయన అమెరికాలోని టెంపుల్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్లోని డెర్మటాలజీ విభాగంలో పనిచేస్తున్నారు. బాగా దురదలు ఎక్కువగా ఉండే కొంతమంది రోగులతో పాటు, పదిమంది ఆరోగ్యవంతులైన వారిని ఈ పరిశోధన కోసం తీసుకున్నారు. వారికి అత్యాధునికమైన ఎఫ్ఎంఆర్ఐ నిర్వహించి చూశారు. దురదలు ఎక్కువగా ఉండి, గోక్కునేటప్పుడు వారికి మెదడులో ఉండే మోటార్ కంట్రోల్, రివార్డ్ ప్రాసెసింగ్ భాగాలు బాగా ఉత్తేజితం అయినట్లు గుర్తించారు. ఇలా అతిగా ఉత్తేజితం కావడం వల్లే గోక్కోవాలని అనిపిస్తుందని తమ పరిశోధన వ్యాసంలో పేర్కొన్నారు. వాళ్లకు దురద పుట్టడం కోసం ఈ పరిశోధన సమయంలో దురద గుంట ఆకు ఉపయోగించారు.