ఎలుగుబంటిని వేటాడి దాని మాంసం విక్రయిస్తున్న నలుగురిని అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఎలుగుబంటిని వేటాడి దాని మాంసం విక్రయిస్తున్న నలుగురిని అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వెల్లుపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం కొందరు వ్యక్తులు ఎలుగుబంటి మాంసాన్ని విక్రయిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఎలుగుబంటి చర్మం, మాంసం స్వాధీనం చేసుకున్నారు.