పెంపుడు జంతువులంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా పెట్స్‌ని పిల్లలు ప్రాణంగా చూసుకుంటారు. వాటి ఆలనా పాలనా అంతా తామే చూస్తారు. ఇంట్లో వాళ్లయినా సరే వాటిని ఏమన్నా అంటే చూస్తూ ఊరుకోరు. మరోవైపు వైల్డ్ అనిమల్స్‌ని జూలో చూడటానికి ఓకే కానీ ఇంటికి వస్తే హడలిపోతాం. అవెక్కడ దాడి చేస్తాయో అని వాటికి దూరంగా వెళ్తాం, పరిస్థితులు అనుకూలిస్తే దాక్కుంటాం. కానీ దీనికి రివర్స్‌లో జరిగింది ఓ చోట. అడవి ఎలుగుబంటి ఇంట్లోకి వచ్చి పెంపుడు జంతువుల మీద దాడికి సిద్ధమైతే ఓ పాప ధైర్యంగా ఆ ఎలుగుతో పోరాడింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ఎంత ధైర్యమో
ఇండియాలోనే ఈ ఘటన జరిగినప్పటికీ ఎక్కడ జరిగిందనే వివరాలపై స్పష్టత లేదు. ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ సుశాంత నంద తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియో షేర్ చేశారు. పెంపుడు జంతువులను కాపాడేందుకు ఆ చిన్నారి చేసిన సాహాసం చూసి, ఆ పాపను మెచ్చుకుంటున్నారు నెటిజన్లు.
చదవండి : హంసనావ
Comments
Please login to add a commentAdd a comment